ఐ యామ్ వెరీ హ్యాపీ....బాబు మెచ్చిన మంత్రి
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరో పేరు పని రాక్షసుడు. ఆయనలా పనిచేసే వారు అయితే ఎవరూ లేరు అని చెప్పవచ్చు.;
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరో పేరు పని రాక్షసుడు. ఆయనలా పనిచేసే వారు అయితే ఎవరూ లేరు అని చెప్పవచ్చు. ఈ దేశంలోనే కాదు అనేక దేశాలలో తరచి చూసినా బాబు మాదిరిగా రోజులో అత్యధిక గంటల సమయం పనిలోనే ఉంటూ అలుపూ సొలుపూ లేకుండా పనిచేయడం అంటే ఎవరికీ సాధ్యం కాదేమో. పైగా ఉదయం ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ తో ఉంటారో రాత్రికి కూడా అదే విధంగా ఉండడం బాబు మార్క్ వర్క్ కల్చర్. అలాంటి బాబు పని విషయంలో మరొకరిని మెచ్చుకున్నారు అంటే అది ఆస్కార్ అవార్డు కింద లెక్క.
శభాష్ మంత్రి గారు :
ఆయన తొలిసారి ఎమ్మెల్యే, అంతే కాదు ఆ వెంటనే మంత్రి అయ్యారు. ఆయనే సత్య కుమార్ యాదవ్. ఆయనకి ఇచ్చిన శాఖ కూడా కీలకమైనది. వైద్య ఆరోగ్య శాఖ. ఇలా ప్రజలతో నిరంతరం సంబంధం ఉన్న శాఖ. మరి మినిస్టర్ గా కొత్త అయిన సత్య కుమార్ యాదవ్ పనితీరు ఎలా ఉంది అన్నది అందరిలోనూ ఉత్కంఠంగానే ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం పెద్ద, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆయన విషయంలో ఒకే మాట అంటున్నారు. ఐ యామ్ వెరీ హ్యాపీ అన్నదే ఆయన మాట.
చంద్రబాబు కితాబు :
అలా ఏపీ వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటూ కితాబిచ్చారు. అది కూడా ఆయన ఎక్కడో చెప్పలేదు, నిండు శాసనసభలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరి ముందూ మంత్రి పనితీరుని కొనియాడారు. వైద్యారోగ్య మంత్రి సత్య చాలా బాగా పనిచేస్తున్నారు అంతే కాదు చాలా కష్టపడుతున్నారు ఆయన తన శాఖను బాగా అవగతం చేసుకున్నారు. సో ఐ యామ్ వెరీ హ్యాపీ అని చంద్రబాబు అన్నారు.
నిబద్ధతతో ముందుకు :
చంద్రబాబు వంటి దిగ్గజ నేత మెప్పు పొందారు అంటే సత్యకుమార్ యాదవ్ కి మంచి భవిష్యత్తు ఉందనే అంటున్నారు. ఆయన మరో దిగ్గజ నేత మాజీ ఉప రాష్ట్రపత్రి ఎం వెంకయ్య నాయుడు సాహచర్యంతో ఆయన శిష్యునిగా పెరిగారు, ఎదిగారు. ఆయన బీజేపీకి నిబద్ధతతో పనిచేసే నాయకుడిగా ఉంటూ వచ్చారు. యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంతో తన వంతు పాత్ర పోషించి ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు కూడా సంపాదించుకున్నారు. అనూహ్యంగా ఆయన అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. నిజానికి ఆయన ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో మంత్రి కావాల్సింది అని అంటారు. ఏది ఏమైనా బాబు నాయకత్వంలోని కూటమిలో పనిమంతుడైన మంత్రిగా కితాబు పొందడం మాత్రం సత్య కుమార్ యాదవ్ కి గొప్ప అవార్డుగానే చూస్తున్నారు