చంద్రబాబు అను నేను...వైసీపీకి భారీ షాక్ ?
ముఖ్యమంత్రి చంద్రబాబు విరామం లేకుండా ఏపీ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.అంతే కాదు వరసబెట్టి ప్రతిష్టాత్మకమైన సాగు నీటి ప్రాజెక్టులని ప్రారంభిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విరామం లేకుండా ఏపీ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.అంతే కాదు వరసబెట్టి ప్రతిష్టాత్మకమైన సాగు నీటి ప్రాజెక్టులని ప్రారంభిస్తున్నారు. అలా వెలిగొండ సాగు నీటి ప్రాజెక్టు మొదటి దశను గత నెల 31న ప్రారంభించి జాతికి అంకితం చేసిన బాబు ఆ సందర్భంగా క్రిష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసి ప్రణమిక్ల్లారు. ఒక రోజు తేడాలో సెప్టెంబర్ 2న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని తరలించి ఉత్తరాంధ్రకు కొత్త ఊపిరిని అందించారు. ఈ సందర్భంగానూ బాబు గోదావరి తల్లికి సాష్టాంగ నమస్కారం పెట్టారు. ఈ రెండు సంఘటనలు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల పాలన తరువాత జోరు మరింతగా పెంచింది అని విశ్లేషిస్తున్నారు.
కదిలిన ప్రాజెక్టులు :
దశాబ్దాల తరబడి కలగా మిగిలిన సాగు నీటి ప్రాజెక్టులను సాకారం చేయడం కూటమి సాధించిన విజయంగా చెబుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఒంగోలు జిల్లాకు పెద్ద ఎత్తున సాగు తాగు నీటి ప్రయోజనం కలుగుతుంది. అలాగే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు ఎంతో ఉపయోగం చేకూరుతుంది. ఈ రెండు ప్రాజెక్టులతో లక్షలాది ఎకరాలకు మేలు చేకూరుతుంది. చేను చిగురిస్తుంది, పచ్చని చీరను భూములు కట్టుకుని ఏపీకి కొత్త అందాన్ని తీసుకుని వస్తాయి.
బాబు అను నేను అంటూ :
ఇదిలా ఉంటే చంద్రబాబు ఇటీవల తన ప్రంగాలలో స్టైల్ మార్చేశారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ చంద్రబాబు అను నేను అని గట్టిగా చెబుతున్నారు. నిజానికి ఇది ప్రమాణం చేసినపుడు వాడేది. అంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈ కార్యక్రమాలను ప్రమాణ పూర్తిగా బాధ్యత తీసుకుని పనిచేశాను అని జనాలకు నేరుగా చెప్పడం కావచ్చు అని అంటున్నారు. అంతే కాదు 2029 లో కూడా మరోసారి పక్కాగా గెలుస్తాను ఇదే తీరున ప్రమాణం చేస్తాను అన్న ఆత్మవిశ్వాసం ప్రజలలో క్యాడర్ లో కూడా కలిగించడం కావచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా బాబు మార్క్ ఈ నినాదం అయితే బాగానే జనంలోకి వెళ్తోంది అని అంటున్నారు.
సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు :
ఇక ఇదే తీరున ఏపీలో బాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా ఆయన ప్రతీ నెలా ఒక్కో జిల్లాకు వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆయన నిరంతరం ప్రజలతో ఉంటున్నారు. ఇక స్థానిక ఎన్నికల నేపధ్యంలో జోరు ఇంకా పెంచారు. ఈసారి జరిగే ఎన్నికల్లో మేయర్ సీటు నుంచి పంచాయతీ వార్డు మెంబర్ దాకా అన్నింటా కూటమి కచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలతో బాబు పనిచేస్తున్నారు అని అంటున్నారు. నిజానికి ఎక్కడ ఎన్నికలు జరిగినా నూరు శాతం రిజల్ట్ రాదు, కానీ ఏపీలో ఆ రికార్డు క్రియేట్ చేయాలని బాబు చూస్తున్నారు. వైసీపీకి భారీ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా స్థానికంగా ఎక్కడా గెలవకుండా చూసుకుంటే ఇక ఆ పార్టీలో నైతిక స్థైర్యం కుప్ప కూలుతుందని అది కూటమికి 2029లో ఘన విజయనానికి నల్లేరు మీద నడక అవుతుందని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు. బాబు ఇలా జోరు పెంచితే వైసీపీ ఇంకా స్థానిక ఎన్నికల సన్నాహాల్లో మొదటి ఎపిసోడ్ దగ్గరే ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏపీలో లోకల్ ఫైట్ ఏ విధంగా జరుగుతుందో.