కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా... తెరపైకి కొత్త చర్చ!

లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుందని వార్తలు వస్తున్న వెళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా.. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు.

Update: 2024-03-10 03:46 GMT

లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుందని వార్తలు వస్తున్న వెళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా.. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విషయం తీవ్రచర్చకు దారితీసింది. ఆయన పదవీకాలం 2027 డిసెంబర్ వరకూ ఉండగా.. ఇలా ఎన్నికల ముందు ఆయన అర్ధాంతరాంగా తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

అవును... కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు పంపించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు! ఈ వివరాలను కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇలా తన పదవీ కాలం ముగియక ముందే ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

వాస్తవానికి ఇప్పటికే ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ లోని మరో కమిషనర్ అనుప్ పాండే.. గత నెలలో పదవీ విరమణ చేయగా ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా అరుణ్ గోయెల్ కూడా రాజీనామా చేయడంతో ఇక ఆ ప్యానెల్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.

ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుండటంతో... ఈయన అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అరుణ్ గోయెల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈలోగా ఆయన రాజీనామా చేశారు. కాగా... ఈ నెల 14, 15 తేదీల్లో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావొచ్చని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గోయెల్ రాజీనామా చేయడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలుస్తుంది!

Tags:    

Similar News