• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు కేసు : అవినీతి...

చంద్రబాబు కేసు : అవినీతి మీద కాదు... దాని మీదేనా...?

| నేరం చేసిన వారిని పరిరక్షించడానికి ఈ సవరణ పార్లమెంట్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తెసుకుని వచ్చారు.

By - Tupaki Desk
Update: 2023-10-10 12:34 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసు విషయంలో ఇపుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు గత నెల 9న నంద్యాలలో అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అక్రమం అని గత నెల రోజులుగా ఆయన తరఫున న్యాయవాదులు కోర్టులలో వాదిస్తున్నారు. ఈ నెల రోజులూ చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది.

దాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన బాబు తరఫున న్యాయవాదులు అక్కడ కూడా టెక్నికల్ పాయింట్ మీదనే వాదిస్తున్నారు. 17ఏ అన్న దాని ప్రకారం బాబుని ఎలా అరెస్ట్ చేస్తారు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. నేరం జరిగింది 2018కి ముందు అయినా విచారణ తరువాత జరిగింది కాబట్టి బాబు విషయం గవర్నర్ కి తెలియచేయాలని అలా అరెస్ట్ చెల్లదు అన్న పాయింట్ మీదనే రోజుల తరబడి వాదిస్తున్నారు.

ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే స్కిల్ స్కాం లో బాబు పాత్ర ఎంత ఆయన నిజంగా ఇందులో ఏమైనా అవినీతికి పాల్పడ్డారా లేక ఆయన క్లీన్ గా ఉన్నారా అన్న దాని మీద ఆయన కేసులో వాదనలు జరగడంలేదు. నిజంగా ఇది ఆశ్చర్యకరమే. ఇక ఇపుడు 17ఏ అన్న పీసీ యాక్ట్ లో సవరణ విషయానికి వస్తే పొరపాటున కానీ లేక కక్షపూరితంగా కానీ లేక కావాలని కానీ ఈ కేసులో ఎవరైనా నిజాయతీపరులను ఇరికించి ఉంటే కనుక వారికి రక్షణ కవచంగా ఈ సవరణ పనిచేస్తుంది అని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఇదే పాయింట్ మీద సుప్రీం కోర్టులో సీఐడీ తరఫున వాదించిన ముకుల్ రోహత్గి చెప్పుకొచ్చారు. నేరం చేసిన వారిని పరిరక్షించడానికి ఈ సవరణ పార్లమెంట్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తెసుకుని వచ్చారు. ఇక 17ఏ బాబుకు వర్తించదు అని ఆయన అంటున్నారు 2018కి ముందే జీఎస్టీ ఈ కేసులో విచారణ జరిపిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఆనాడు సీఎం గా చంద్రబాబు ఉన్నారని విచారణ అయితే తరువాత దశ అన్నది ఏమైందో చూడాలని అన్నారు.

సరే ఇరు పక్షాల వాదనల సంగతి ఎలా ఉన్నా నేరం జరిగిందా లేదా అన్నది ఎప్పుడైనా పాయింట్ గా ఉంటుంది. టెక్నికల్ రీజన్స్ బట్టి అసలు కేసే పెట్టరాదని వాదించడం మీద న్యాయ నిపుణుల మధ్య చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఈ కేసులో బాబు రిమాండ్ రిపోర్టుని కొట్టివేయాలని ఆయన న్యాయవాదులు పోరాడుతున్నారు.

అయితే సుప్రీం కోర్టులో వాదనలు మాత్రం జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నానికి ఈ కేసు విచారణ వాయిదా పడింది. మరి ఆ రోజు అయినా దీని మీద ఏమైనా జరుగుతుందా లేక సోమవారానికి వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా 17ఏ అన్న పీసీ చట్ట సవరణ మీద వాదనలు రేపటి కేసులకు కూడా ఉపయోగపడతాయేమో అంటున్నారు.

Tags:    
  • Andhrapradesh 
  • Politicalnews 
  • Cbnarrest 
  • Cbnjail 
  • Skilldevelopment 
  • Chandrababunaidu 
  • Supremecourt 
  • Highcourt 
  • Mukulrohatgi 

Similar News

తేడా స్వల్పం.. ఫలితాల్లో చాలా వ్యత్యాసం - విజయనగరం జిల్లా ఓట్ల లెక్కలు ఆసక్తికరం

2026-11-09 17:30 GMT

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

యుద్ధంలో గెలుపు ఎవరిది? రష్యాకు మిగిలేది శవాల లెక్కేనా?

2026-11-09 15:30 GMT

70 కోట్ల విలువైన‌ న‌కిలీ రూ.20 కాయిన్‌లు త‌యారు చేసిన కేటుగాళ్లు!

2026-11-09 14:30 GMT

జెన్‌జీల కొత్త ట్రెండ్ ‘మాగింగ్’.. అసలేంటిది? ఏం చేస్తున్నారు?

2026-11-09 13:30 GMT

జెన్సన్ హువాంగ్‌కు మస్క్, బిల్ అక్‌మన్ మద్దతు.. వివాదంపై ఎన్విడియా బోర్డు దర్యాప్తు!

2026-11-09 12:35 GMT

ఒక్క రాత్రిలో 50 కోట్లు మటాష్ !

2026-11-09 12:30 GMT

యూపీఏ సర్కార్ రికార్డును బ్రేక్ చేసిన మోదీ ప్రభుత్వం.. ఎందులో అంటే..?

2026-11-09 11:02 GMT

కూటమికి వైసీపీ మధ్య బిగ్ గ్యాప్ ...బాబు చెప్పిన లెక్క !

2026-11-09 10:58 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

100 శాతం స్ట్ర‌యిక్ రేట్.. కోటంరెడ్డి ఆశ‌లు నెర‌వేరుతాయా?!

2026-11-09 10:38 GMT

`ప‌రిష‌త్` లెక్క తేలింది.. ఫైన‌ల్ ఫ‌లితం ఇదే!

2026-11-09 10:33 GMT

Copyright @2026

Powered by Blink CMS