బొత్స ఖండించినట్లేనా ?
తాను ఎందుకు పార్టీ మారుతాను అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయకుండా అవతల వారికి పనేమీ లేదని అందుకే అలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డి తన మీద పరోక్షంగా వైసీపీ మీద ప్రత్యక్షంగా చేసిన వ్యాఖ్యల మీద స్పందించేందుకు సీనియర్ నేత వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిరాకరించారు. ఆయన మాటల మీద రియాక్ట్ కావడం అంటే టైం వేస్ట్ అని ఒక్క మాటలో తేల్చేశారు. ఇక ప్రజా సమస్యల గురించి తాను మాట్లాడుతాను అని తాజాగా విశాఖలో పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డిని కేఏ పాల్ తో పోల్చారు. అంతకు ముందు పాల్ ఇలాగే మాట్లాడేవారు అని అన్నారు.
పార్టీ మార్పుపైన :
తాను జనసేనలో చేరుతున్నాను అని ఇండైరెక్ట్ గా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ కి కూడా బొత్స తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కేబినెట్ మీటింగులకు వెళ్ళకుండా పవన్ ఖాళీగా ఉన్నారని ఇక్కడ విజయసాయిరెడ్డి ఖాళీగా ఉన్నారని అందుకే ఇలాంటి పుకార్లు వ్యాపిస్తున్నాయని బొత్స ఫైర్ అయ్యారు. తాను పార్టీ మారట్లేదు అని బొత్స చెప్పారు. ఆ మీదట ఆయన కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబుని విమర్శిస్తూ హట్ కామెంట్స్ చేశారు.
పెద్ద ఎత్తున పుకార్లు :
ఇదిలా ఉంటే బొత్స సత్యనారాయణ పార్టీ మారుతారు అని జనసేనలో చేరుతారు అని పెద్ద ఎత్తున పుకార్లు వస్తూ ఉంటే దానికి బొత్స రియాక్షన్ చాలా సింపుల్ గా ఉందని అంటున్నారు. ఆయన ఒక్క ముక్కలో తేల్చేశారు. నిజం చెప్పాలంటే లైట్ తీసుకున్నారు. తాను ఎందుకు పార్టీ మారుతాను అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయకుండా అవతల వారికి పనేమీ లేదని అందుకే అలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దాంతో బొత్స మీద వస్తున్న ప్రచారానికి ఈ వివరణ సరిపోయినట్లేనా అన్న చర్చ వస్తోంది.
అవసరం లేదనేనా :
నిజం చెప్పాలంటే పార్టీ మార్పు మీద ప్రచారం జరిగినపుడు ఏ విధంగా రియాక్ట్ అయినా కూడా ఊహాగానాలు అయితే తగ్గేది ఉండదని అంటున్నారు. అందుకే బొత్స లైట్ తీసుకున్నారని అంటున్నారు. తాను పార్టీ మారడం లేదని ఆయన చెప్పేసి అక్కడితో ఆ టాపిక్ ముగించారు. మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం కూడా బొత్స పార్టీ మార్పు మీద వస్తున్న ప్రచారాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదని అంటున్నారు. బొత్స వైసీపీలో ఉంటారని భావిస్తోంది అని కూడా చెబుతున్నారు.
ఈ పుకార్లు ఆగుతాయా :
బొత్సకు పార్టీ పరంగా ఇబ్బందులు లేవని ఆయనను గౌరవిస్తున్నామని వైసీపీలో భావన ఉంది. అందుకే ధీమాగా ఉన్నారు. బొత్స వరకూ చూసుకుంటే ఆయన బిగ్ షాట్. పొలిటికల్ గా సీనియర్. ఆయన వైసీపీలోకి రావడానికి కూడా కారణాలు ఉన్నాయని చెబుతారు. కాంగ్రెస్ పార్టీ పతనం చెందాకనే ఆయన ఈ వైపు చూశారు. ఇక ఆయన కుటుంబానికి కూడా వైసీపీలో పొలిటికల్ గా అకామిడేషన్ బాగానే దొరకుతోంది. దాంతో ఆయన ఎందుకు పార్టీ మారుతారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బొత్స ఖండించారు కదా అన్న మాట అయితే ఉంది. మరి చూడాలి ఇక్కడితో ఈ పుకార్లు ఆగుతాయా లేవా అన్నది.