జనసేన నేతలు లోలోపల రగిలిపోతున్నారా... ఏమిటీ వారి బాధ?

ఈ నేపథ్యంలోనే... "ఎమ్మెల్యే నా కొ*డుకులు అంటూ రోజా మాట్లాడుతుందని.. అది ఆడో, మగో ఎవరికీ తెలియదంటూ" ఏక వచనంతో సంభోదిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బొలిశెట్టి శ్రీనివాస్.;

Update: 2025-07-22 17:34 GMT

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడినా కాస్త అటు ఇటుగా ప్రజలు అర్ధం చేసుకుంటారు కానీ.. బాధ్యతాయుతంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు నేతలు నాలుక అదుపులో పెట్టుకుని, వీలైనంత పనికొచ్చే మాటలు, ఫిల్టర్ తో కూడిన వ్యాఖ్యలు చేయాలని అంటుంటారు పరిశీలకులు. ఈ సందర్భంగా గతంలో పలువురి నేతల నోటి మాటల ప్రభావాలు, ఫలితాలను ఉదాహరణలుగా చూపిస్తుంటారు.

ఆ విషయం ఇప్పుడు మాట్లాడుతున్న నేతలకు తెలియంది కాదు కానీ... అధికారంలో ఉన్నప్పుడు ఆ తరహా భయాలు, ఆందోళనలు, ఆలోచనలూ ఉండవని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంచితే... తాజాగా జనసేన ఎమ్మెల్యే ఒకరు చేసిన పలు వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలతో పాటు అడుక్కుతినాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మరాయి.

అవును... పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తొలుత వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజ‌లే చెప్పాల‌ని.. ప్రభుత్వం మంచి చేస్తుంద‌ని ప్రజ‌లు చెప్పక‌పోతే ర‌ప్పా ర‌ప్పా గాళ్లు రోడ్డెక్కి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే... "ఎమ్మెల్యే నా కొ*డుకులు అంటూ రోజా మాట్లాడుతుందని.. అది ఆడో, మగో ఎవరికీ తెలియదంటూ" ఏక వచనంతో సంభోదిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బొలిశెట్టి శ్రీనివాస్. "జగన్ కూడా ఎమ్మెల్యేనే కాబట్టి అతను కూడా దాని కొడుకేనా" అంటూ మాట్లాడారు! ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు! అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... కూటమి ధర్మం ప్రకారం అన్ని పార్టీలకు సమానమైన అవకాశాలు ఉండాలని చెప్పిన బొలిశెట్టి శ్రీనివాస్... అసలు జనసేన గెలిచిన 21 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసా అంటూ ప్రశ్నించారు. అందరిని ఒకచోట కూర్చోబెట్టి చర్చిస్తే తమ బాధేంటో తెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలోనే... కూటమిలోని అందరం కలిసుంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని.. లేదంటే ఐదేళ్లు అడుక్కోవాల్సి వస్తుందంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు! తమకు ఉన్న హక్కుల గురించి అడుగుతాం కానీ.. అడిగినంత మాత్రాన్న కాంట్రవర్సరీ కాదని తెలిపారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అందరికీ తెలుసని అన్నారు! దీంతో... ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి!

కాగా... ఇటీవల కొవ్వూరు జనసేన ఇంఛార్జి టీవీ రామారావును జనసేన అధిష్టానం ఆ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన నేతలకు సరైన గుర్తింపు, ప్రాధాన్యం లభించడం లేదంటూ ఆయన అధిష్టాణానికి లేఖ రాయడంతో.. ఇది ఎన్డీఏ కూటమి స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉందని.. అతనిని తప్పించినట్లు చెబుతున్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News