డీలిమిటేషన్ వార్... బీజేపీ స్టెప్ ఏంటి ?
డీలిమిటేషన్ బిల్లుని ఎలా అయినా ఆమోదించుకోవాలన్నది బీజేపీ ఆలోచన. ఒక విధంగా చెప్పాలీ అంటే పట్టుదల కూడా.
డీలిమిటేషన్ బిల్లుని ఎలా అయినా ఆమోదించుకోవాలన్నది బీజేపీ ఆలోచన. ఒక విధంగా చెప్పాలీ అంటే పట్టుదల కూడా. బీజేపీ 2014 నుంచి చూస్తే తాను అనుకున్న బిల్లులను పార్లమెంట్ లో నెగ్గించుకుంది. ఆఖరికి కాశ్మీర్ ని రెండు ముక్కలు చేసి అసాధ్యం అనుకున్న 370 ఆర్టికల్ ని కూడా రద్దు చేసింది. ఇలా చెప్పుకుంటే అనేకం బీజేపీ చేయగలిగింది. కానీ డీలిమిటేషన్ బిల్లు మాత్రం బీజేపీకి మింగుడు పడడం లేదు. ఒకసారి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ భంగపడింది. దాంతో మరింతగా కసి కమలనాధులలో పెరిగిపోతోంది. మరోసారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అయినా డీలిమిటేషన్ బిల్లుకి ఆమోదముద్ర వేయించుకోవాలని బీజేపీ చూస్తోంది. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ మోకాలడ్డుతోంది. ఈ తరహా ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తోంది.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో :
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రోరోగ్ చేయలేదని గుర్తు చేశారు. అంటే అవసరమైతే మరోసారి పార్లమెంట్ ని పిలిచి సమావేశ పరచే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఇదంతా ఎందుకు అంటే డీలిమిటేషన్ బిల్లు కోసమే అని అంటున్నారు. ఈ విధంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు అయితే విపక్షాలకు మంట పుట్టిస్తున్నాయి. డీలిమిటేషన్ ఎపిసోడ్ ఏప్రిల్ 16, 17 ప్రత్యేక సమావేశాలలో వీగిపోవడంతోనే అయిపోయిందని కాంగ్రెస్ అంటోంది. మరోసారి అలాంటి ప్రయత్నం చేయవద్దు అని కోరుతోంది. దీని మీద కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు.
ఆ సీట్లు చాలు అంటూ :
ఇక లేటెస్ట్ గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో పలు డిమాండ్లు పెట్టారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ద్వారా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ఆలోచనలు విరమించుకోవాలని కోరారు. అంతే కాదు డీలిమిటేషన్ అంశంపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ విషయం మీద కేంద్రం ఏమైనా ఆలోచన చేయాలని అనుకుంటే ముందుగా అన్ని రాజకీయ పార్టీలతో తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఖర్గే కోరారు. అదే సమయంలో ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను మరో 25 ఏళ్లపాటు ఇదే తీరున మార్చకుండా అలాగే కొనసాగించాలని కూడా ఖర్గే డిమాండ్ చేశారు. ఈ 543 లోక్ సభ సీట్లతోనే 2029 లోక్‌సభ ఎన్నికలను నిర్వహిస్తూ వీటి నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఖర్గే స్పష్టం చేశారు.
పూర్తిగా రాజకీయ ఆధిపత్యం :
ఇంత క్లియర్ కట్ గా కాంగ్రెస్ నుంచి లేఖ రావడంతో ఇపుడు బీజేపీ ఏమి చేస్తుంది అన్నది అంతా ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రతిపక్షం దాని సూచనలు డిమాండ్లు పెడుతోంది కానీ వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఎక్కడా లేదు కదా అంటున్నారు. బీజేపీకి డీలిమిటేషన్ చాలా ముఖ్యమని అంటున్నారు. ఇపుడు ఉన్న సెటప్ లో 2029 ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ అనుకోవడం లేదు, సీట్లను విడగొట్టాలి, అలాగే మహిళా రిజర్వేషన్లు కూడా ఇస్తూ ఇపుడు దేశంలో ఉన్న రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయాలని బీజేపీ భావిస్తోంది. అలా చేస్తేనే తమకు పూర్తిగా రాజకీయ ఆధిపత్యం ఉండడమే కాకుండా విజయావకాశాలు ఉంటాయని కూడా భావిస్తోంది. మరి కాంగ్రెస్ సహా విపక్ష శిబిరం డీలిమిటేషన్ కి సహకరిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ఈ నంబర్ గేం లో గెలిచేది ఎవరూ అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది.