లోక్ సభకు మధ్యంతరమా ? హస్తినలో హాట్ హాట్ చర్చ !

లోక్ సభకు ఎన్నికలు జరిగి కేవలం పదిహేను నెలలు మాత్రమే అయ్యాయి. ఇంకా నలభై అయిదు నెలల పాటు అధికారం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేతిలో ఉంది.;

Update: 2025-08-25 21:30 GMT

లోక్ సభకు ఎన్నికలు జరిగి కేవలం పదిహేను నెలలు మాత్రమే అయ్యాయి. ఇంకా నలభై అయిదు నెలల పాటు అధికారం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ ఇపుడు హఠాత్తుగా ఎన్నికలు అన్న మాట వినవస్తోంది. అసలు ఎందుకు ఏమిటీ ఈ చర్చలు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎండీయే ప్రభుత్వం 2029 దాకా అయిదేళ్ళూ పాలిస్తుందని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. కానీ రాజకీయం మాత్రం వేరేలా సాగుతోంది అని అంటున్నారు.

ఇద్దరు మిత్రుల మీదనే :

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇద్దరు మిత్రుల మీద ఆధారపడి సాగుతోంది. ఏపీ నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీహార్ నుంచి జేడీయూ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ల మద్దతుతోనే ఎన్డీయే సాగుతోంది. ఇక బీహార్ ఎన్నికలలో ఎన్డీయే కనుక ఓటమి పాలు అయితే ఆటోమేటిక్ గా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గద్దె దిగుతుందని ఇప్పటికే ఇండియా కూటమి నేతలు బీహార్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు ఎన్నడూ లేని విధంగా ఓటు చోరీ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.

ఇంటా బయటా సమస్యలే :

ఇక మోడీ తొలి రెండు సార్లు పాలించిన తీరు వేరు. మూడవసారి మాత్రం అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయని అంటున్నారు. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా భారత్ కి దూరం అయింది. పైగా భారత్ మీద ఎన్నడూ లేని విధంగా కన్నెర్ర చేస్తోంది. ఇక చైనా నమ్మదగ్గదు కాదు అన్నది తెలిసిందే. ఇక పాక్ చైనా బంధం అందరికీ తెలిసిందే. దాంతో అంతర్జాతీయంగా భారత్ కొంత ఇబ్బంది పడుతోంది. దేశంలో చూస్తే ఓటు చోరీ ఆరోపణలు బీజేపీ పెద్దలను సతమతానికి గురి చేస్తున్నాయి అని అంటున్నారు. ఇది పెద్ద ఇష్యూగా రోజు రోజుకీ మారుతోంది.

వర్షాకాలం సభ అంతా :

ఓటు చోరీ ఆరోపణలు నినాదాలతో వర్షాకలం సభ మొత్తం అర్పితం అయిపోయింది. ఏకంగా బీజేపీ పెద్దల మీదనే ఈ ఆరోపణలు విపక్షాలు చేస్తూ వస్తున్నాయి. దాంతో ఏ విధంగా దీనిని ఎదుర్కోవాలన్నది అయితే అర్ధం కావడం లేదు అని అంటున్నారు. మరో వైపు ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి 75 ఏళ్ళ కండిషన్ గుర్తు చేస్తోంది. మోడీ ప్రభుత్వం కార్పోరేట్ల పఖం వహిస్తోంది అన్న దానితో పాటు చాలా విషయాలలో ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తిగా ఉందని అంటున్నారు. దాంతో ఆ వైపు నుంచి అనూహ్యగా వస్తున్న ఒత్తిడి కూడా ఇబ్బంది పెట్టేలాగానే ఉంది అని అంటున్నారు.

తేల్చనున్న బీహార్ :

ఇక బీహార్ ఎన్నికల్లో కనుక నితీష్ కుమార్ ఓటమి పాలు అయి మాజీ సీఎం అయితే ఆయన ఖాళీగా చూస్తూ ఊరుకోరని అంటున్నారు. ఆ ప్రభావం నేరుగా కేంద్రం మీదనే పడుతుందని అంటున్నారు. అదే విధంగా ఓటు చోరీ అంటూ విపక్షం చేస్తున్న ఆరోపణలు కూడా బీజేపీకి అవమానకరంగా ఉన్నాయని అంటున్నారు. దాంతో ప్రజలలోనే తేల్చుకోవాలని ఏ ఒక్కరికీ చాన్స్ ఇవ్వకుండా తామే పావులు కదపాలని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

మూడేళ్ళల్లో వ్యవధిలోనే :

ఇక కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2027 నాటికి మూడేళ్ళు అవుతుంది దాంతో ఆ ఏడాది మేలో ఎన్నికలకు వెళ్ళవచ్చు అన్న చర్చ అయితే ఢిల్లీ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది ఆ ముహూర్తం ఎందుకు అంటే యూపీ ఎన్నికలు గుజరాత్ ఎన్నికలు అదే సమయంలో ఉన్నాయి. దాంతో వాటితో కలుపుకుని ఎన్నికలకు వెళ్తే భారీ రాజకీయ లాభం ఉండొచ్చని తాను జనంలోకి వెళ్ళి ఓటు చోరీ ఆరోపణలకు అక్కడే సరైన బదులు విపక్షానికి ఇవ్వవచ్చు అన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా ఉంది అని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ప్రచారం ఢిల్లీలో సాగుతోంది. చూడాలి మరి ఇందులో వాస్తవరం ఏమిటన్నది.

Tags:    

Similar News