లోకేష్ కు భరత్ మాస్ వార్నింగ్

ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కొడుకు, బాలకృష్ణ అల్లుడు...ఇవి కాకుండా. ప్రత్యక్ష ఎన్నికలలో ఎప్పుడైనా గెలిచావా లోకేష్ అని భరత్ ప్రశ్నించారు.

Update: 2023-09-05 02:30 GMT

యువగళం పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సైకో జగన్ అంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని ఆల్రెడీ వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. అయినా సరే లోకేష్ మాత్రం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లోకేష్ కు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. "ఓయ్ ముద్దపప్పు.. నోరు లేస్తోంది.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. కాస్త నోరు అదుపులో పెట్టుకో" అంటూ లోకేష్ కు భరత్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.

ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కొడుకు, బాలకృష్ణ అల్లుడు...ఇవి కాకుండా. ప్రత్యక్ష ఎన్నికలలో ఎప్పుడైనా గెలిచావా లోకేష్ అని భరత్ ప్రశ్నించారు. అడ్డదార్లలో తన కొడుకును చంద్రబాబు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెడితే దానిని వెలగబెట్టాడని, అసలు లోకేష్ కు తనకంటూ ఉన్న అర్హత ఏంటని భరత్ ప్రశ్నించారు. మిడ్ నైట్ పాదయాత్ర చేసే ముద్ద పప్పు లోకేష్ కు పాదయాత్ర లక్ష్యం ఏమిటో తెలుసా అని చురకలంటించారు.

లోకేష్ గురించి ఎక్కువ మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోవడం తనకు ఇష్టం లేదని, కానీ, జగన్ పై అవాకులు చవాకులు పేలుతున్న నేపథ్యంలో స్పందించాల్సి వచ్చిందని అన్నారు. సీఎం జగన్ ను ఉద్దేశించి కించపరిచే పదాలు వాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ ను హెచ్చరించారు. కనీసం వార్డు మెంబర్ గా గెలవలేని లోకేష్ ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నాడని భరత్ ప్రశ్నించారు. లోకేష్ చేసేది యువగళమా.. గందరగోళమా అని భరత్ ఎద్దేవా చేశారు.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తమ నాయకుడు జగన్ చేసిన మాదిరిగా పాదయాత్ర చేయాలని, అర్ధరాత్రి మూడింటికి వెలుగుజిలుగుల మధ్య పాదయాత్ర ఏంటని ప్రశ్నించారు. తెల్లవారుజామున పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నైట్ వాక్, మిడ్ నైట్ వాక్ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని, ఒళ్ళు, కొవ్వు తగ్గి లోకేష్ కు మాత్రం ఉపయోగమే అని భరత్ పంచ్ లు వేశారు.

Tags:    

Similar News