వణికిస్తోన్న న్యూ బాబా వంగ జోస్యం.. జూలై 5 న ఏమి జరగబోతోంది?
బాబా వంగ జోస్యం గురించి చాలా మందికి తెలిసిందే. ఆమె చెప్పిన జోస్యాలు చాలా వరకూ నిజమయ్యాయని అంటారు.;
బాబా వంగ జోస్యం గురించి చాలా మందికి తెలిసిందే. ఆమె చెప్పిన జోస్యాలు చాలా వరకూ నిజమయ్యాయని అంటారు. ఈ క్రమంలో తాజాగా న్యూ బాబా వంగ జోస్యం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ.. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందని ఈ కొత్త బాబా జోస్యం చెప్పారు. దీంతో.. విమాన బుకింగ్స్ 83% తగ్గడం గమనార్హం.
అవును... తాజాగా న్యూ బాబా వంగ అని పిలవబడే జపనీస్ మాంగా కళాకరిణి రియో టాట్సుకి చెప్పిన జోస్యం సంచలనంగా మారింది. పైగా ఈ జోస్యాన్ని మెజారిటీ ప్రజలు బలంగా నమ్ముతున్నట్లు తాజా పరిణామాలు నొక్కి చెబుతున్నాయి. ఇందులో భాగంగా.. జూలై నెలలో జపాన్ కు భారీ సునామీ ముప్పు ఉందని ఆమె అంచనా వేశారు. ఈ మేరకు తన "ది ఫ్యూచర్ ఐ సా" అనే పుస్తకంలో ఈ విషయాన్ని తేదీతో సహా పేర్కొన్నారు!
ఇందులో భాగంగా... 2025 జూలై 5న మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. జపాన్ - ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన.. లేదా, అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ భారీ విపత్తు సంభవించొచ్చని ఆమె తెలిపారు. ఇది మెగా సునామీ, భూకంపం రూపంలో ఉండొచ్చని.. 2011లో భూకంపం వల్ల ఏర్పడిన అలలకంటే మూడు రెట్లు పెద్ద అలలు విరుచుకుపడతాయని వెల్లడించారు.
ఈ మేరకు సముద్రంలో గాలి బుడగలు బయటకు వచ్చే దృశ్యాలు తనకు కలలో కనిపించాయని ఆమె చెప్పారు. ఇది సముద్ర గర్భంలో పెను విపత్తుకు సంకేతమని తన పుస్తకంలో ప్రస్తావించారు. కాగా.. గతంలో ఆమె కోవిడ్-19 మహమ్మారిని అంచన్నా వేసిన సంగతి తెలిసిందే.
బలంగా నమ్ముతోన్న పపంచం!:
న్యూ బాబా వంగ జోస్యాన్ని ప్రపంచం అత్యంత బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జరుగుతోన్న పరిణామాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ జోస్యం తెరపైకి వచ్చిన తర్వాత జపాన్ కు విమాన బుకింగ్ లు 83% తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు.. జూలైలో జపాన్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి!
ఇదే సమయంలో... చైనాలోని హాంకాంగ్ నుంచి వచ్చే విమానాలతో పాటు హోటల్ బుక్కింగ్స్ 50% పడిపోయినట్లు బ్లూమ్ బెర్గ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది.
మరోవైపు... ఈ వ్యవహారంపై స్పందించిన వియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ యోషిహిరో మురై... ఈ పుకార్లను ప్రజలు నమ్మొద్దని సూచించారు. జపనీయులు ఎవరూ దేశం విడిచి విదేశాలకు పారిపోవడం లేదని.. అందువల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.