అందం కోసం రిస్క్.. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్!
అయితే ఇప్పుడు కొంతమంది అలాంటి అందాన్ని సహజంగా కాకుండా కృత్రిమంగా ట్రీట్మెంట్ ద్వారా పొందుతున్నారు.;
అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి.. ప్రతి ఒక్కరికి అందమే ఇంపార్టెంట్.. అది ఆడవారైనా.. మగవారైనా.. అందంగా ఉండాలని తాపత్రయపడతారు. ఎంతోమంది అందవిహీనంగా ఉన్నవారు అందం కోసం ఈ క్రీములని ఆ క్రీములని పూస్తూ ఉంటారు.. అలా అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో చేస్తారు. ఇక కొంతమంది అందంగా లేకపోతే కనీసం బయటికి రావడానికి కూడా ఇష్టపడరు.. అందంగా లేనివారిలో ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది.. వారి మొహం బాలేకపోతే ఎవరు ఏమనుకుంటారో అని మొహమాట పడతారు. అయితే కొంతమంది అందంగా ఉన్నప్పటికీ వారి మొహంలో కల ఉండదు.కానీ కొంతమంది నల్లగా అందంగా లేకపోయినప్పటికీ వారి మొహంలో ఓ కళ ఉంటుంది.
అయితే ఇప్పుడు కొంతమంది అలాంటి అందాన్ని సహజంగా కాకుండా కృత్రిమంగా ట్రీట్మెంట్ ద్వారా పొందుతున్నారు. అదే సొట్ట బుగ్గలు..చాలామంది అమ్మాయిలకు సొట్ట బుగ్గలు ఉంటే మరింత అందంగా కనిపిస్తారు. వాళ్లు నలుపు రంగులో ఉన్నా కూడా వారి మొహంలో నవ్వితే వచ్చే సొట్టబుగ్గలు మొహంలో కల ఉట్టిపడేలా చేస్తాయి. అయితే ఇలాంటి సొట్టబుగ్గలు సహజంగా వస్తాయి. కానీ ఇప్పుడు సొట్ట బుగ్గల కోసం కొంతమంది సాహసాలు చేస్తున్నారు.కృత్రిమంగా సొట్ట బుగ్గలు పెట్టుకోవడం కోసం ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. మరి ఈ సొట్ట బుగ్గల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కామన్ గా ఎవరికైనా సొట్ట బుగ్గల ఉన్నాయి అంటే అవి పుట్టుకతోనే వచ్చినవి. అయితే అందరికీ సొట్టబుగ్గలు ఉండవు. కొంతమందికి మాత్రమే ఉంటాయి. ఇలా సొట్ట బుగ్గలు ఉన్న అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే మరింత అందంగా కనిపిస్తారు. అలా సొట్ట బుగ్గలు ఉన్నవారు నవ్వితే వారి చెంపలపై గుంతలు పడి చాలా క్యూట్ గా కనిపిస్తారు. అయితే ఇలాంటి సొట్ట బుగ్గల కోసం కొంతమంది ఓ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అదే డింపుల్ ప్లాస్టీ.. ఈ ప్రక్రియలో ఎవరికైనా సరే కృత్రిమంగా సొట్టబుగ్గలు తీసుకురావచ్చు. అయితే ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న ఒక అమ్మాయికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో ఏముందంటే.. తన మొహంలో సొట్ట బుగ్గ రావాలి అనుకున్న ఒక అమ్మాయి డింపుల్ ప్లాస్టీ చేయించుకుంది.. ఇక ఇలా చెంపలపై సొట్టలు పడాలంటే శస్త్ర చికిత్స లేదా నోట్లోకి ఒక సన్నని తీగను పంపించి నోటి లోపల ఒక చిన్న గుంట చేసారు.ఆ తర్వాత ఆ సన్నని తీగను కట్ చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి నవ్వితే సొట్టబుగ్గలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి.అయితే ఈ సొట్ట బుగ్గల ట్రీట్మెంట్ అనేది కృత్రిమంగా ట్రీట్మెంట్ ద్వారా వచ్చినప్పటికీ అవి పుట్టుకతో వచ్చినట్టుగానే కనిపిస్తున్నాయి.. అవి కృత్రిమంగా క్రియేట్ చేసిన సొట్టబుగ్గని ఏ మూలన కూడా కనిపించడం లేదు. అలా డింపుల్ ప్లాస్టీ అనే ప్రక్రియను ఉపయోగించి చాలామంది అమ్మాయిలు మరింత అందంగా కనిపించడం కోసం ఇలా సొట్ట బుగ్గలను క్రియేట్ చేయించుకుంటున్నారు. అయితే ఈ డింపుల్ ప్లాస్టీ అనేది సురక్షితమైన ప్రక్రియనే.. దీనివల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఏమీ ఉండదని వైద్యులు అంటున్నారు.కానీ సొట్ట బుగ్గల కోసం మరీ ఇంత రిస్క్ అవసరమా.. తేడా కొడితే ఉన్న అందం కూడా పోతుంది అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. ఏది ఏమైనా అందంగా కనిపించడానికి అమ్మాయిలు ఏం చేయడానికైనా సిద్ధం అంటూ ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు.