వైసీపీ సమర శంఖారావం... గేర్ మారుస్తున్న జగన్ !

వైసీపీ గేర్ మార్చేందుకు జగన్ ఒక డేట్ ని డిసైడ్ చేశారు.;

Update: 2023-10-08 09:45 GMT

వైసీపీ గేర్ మార్చేందుకు జగన్ ఒక డేట్ ని డిసైడ్ చేశారు. అక్టోబర్ 9న విజయవాడలో ఆయన ఏకంగా పదివేల మందికి తక్కువ లేకుండా జిల్లా మండల, స్థాయి వైసీపీ ప్రజా ప్రతినిధులతో అతి పెద్ద సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం వైసీపీ పూర్తించే ఎన్నికల సమర శంఖారావం అని అంటున్నారు.

ఈ సమావేశం ద్వారా జగన్ ఏమి చెప్పబోతున్నారు అన్నది చర్చగా ఉంది. ఏపీలో మరోసారి వైసీపీ ఎందుకు అధికారంలోకి రావాలి, జగన్ అవసరం ఏపీకి ఎంతవరకూ ఉంది అన్న దాని వై ఏపీ నీడ్స్ జగన్ అన్న ప్రోగ్రాం వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి గ్రామ వార్డు మండల, జిల్లా స్థాయిలలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది.

ఏపీకి జగన్ ఏమి చేశారు, మళ్లీ వస్తే ఏమి చేయబోతారు అన్నది ప్రచారం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అదే విధంగా ప్రతీ గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఆయా పరిధిలో ఉన్న లబ్దిదారులకు అమలు చేసిన సంక్షేమ పధకాలతో బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.

అదే విధంగా ప్రతీ ఇంటికీ వాలంటీర్లు వెళ్ళి ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ఇచ్చిన సంక్షేమ పధకాల గురించి వారికి చెప్పి ఆ ఇంటి పెద్ద నుంచి ఈకేవైసీని తీసుకుంటారని అంటున్నారు. ఇలా పధకాల గురించి జనాలకు చెప్పడమే కాదు వారి అధికారిక ఆమోదాన్ని కూడా తీసుకోవడం ద్వారా వీరంతా మా జనాలు వీరితో మా ప్రయాణం అన్నది వైసీపీ బలంగా చెప్పబోతోంది.

ఈ క్రమంలో వైసీపీ ఇపుడు గ్రాస్ రూట్ లెవెల్ లో ఉన్న పార్టీ నాయకులతో మీటింగ్ ని ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ ఒక విధంగా వైసీపీ వ్యూహం ఏమిటి అన్నది తెలియచేస్తుంది అంటున్నారు. రానున్న ఆరు నెలల కామలో ప్రతీ గడప టచ్ చేస్తూ ప్రభుత్వం చేసిన మేలు ఏమిటి అన్నది చెప్పడమే క్యాడర్ లక్ష్యం కాబోతోంది అంటున్నారు.

ఆ విధంగా వారికి దిశా నిర్దేశం జగన్ చేస్తారు అని అంటున్నారు. అంతే కాదు రానున్న రోజులలో తమ ప్రభుత్వం ఏ ఏ వర్గాలకు ఇంకా ఏమి చేయబోతామన్నది కూడా ఆయన వివరిస్తారు అని అంటున్నారు. ఏపీలో కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను అందుకున్న ప్రజలంతా వైసీపీ వైపు ఉండేలా పార్టీ క్యాడర్ లీడర్ చూడాలన్నదే హై కమాండ్ టార్గెట్ అంటున్నారు.

ఏపీలో ప్రతీ గడప వైసీపీ నేతలు టచ్ చేయడం ద్వారా విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదు అన్నదే యాక్షన్ ప్లాన్ అని చెబుతున్నారు. ఇక వైసీపీ ప్రెసిడెంట్ గా సీఎం గా జగన్ ఈ మధ్య కాలంలో ఎపుడూ మండల స్థాయి నేతలతో మీటింగ్ అయితే పెట్టలేదు. ఇపుడు వారితో భారీ సమావేశం అంటున్నారు అంటే కచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఏ ఒక్క చాన్స్ వదలకూడు అన్న విధానంతోనే పార్టీ దూకుడు చేస్తోంది అని అంటున్నారు

ఒక వైపు గ్రామ వార్డు వాలంటీర్లు, మరో వైపు గృహ సారధులు, ఇంకో వైపు పార్టీ క్యాడర్ ఇలా వీరంతా ఒక జట్టుగా కలసి ప్రతీ ఇంటినీ కదిలించాలని వైసీపీకి మొత్తం సానుకూలం చేయాలన్నదే అజెండాగా ఉంది అని అంటున్నారు. టీడీపీ ఇపుడు చంద్రబాబు అరెస్ట్ తరువాత కొంత అయోమయంలో ఉంది. జనసేన టీడీపీతో పొత్తుల విషయంలో క్యాడర్ కి నచ్చచెప్పుకునే పనిలో ఉంది. ఈ కీలక తరుణంలో వైసీపీ యమ జోరు చేయడం ద్వారా టోటల్ గా పాజిటివ్ మూడ్ ని క్రియేట్ చేయాలని చూస్తోంది. మరి జగన్ ఇచ్చే స్పీచ్ ఎలా ఉంటుంది అన్నదే ఇపుడు సర్వత్రా ఉత్కంఠంగా ఉంది మరి.

Tags:    

Similar News