50 % అయినా దాటుతుందా... పార్టీల్లో గుబులు.. !

రాష్ట్రంలో సాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ‌-స‌ర్‌- 50 శాతం కూడా దాట‌క‌పోవడం.. అన్ని పార్టీల్లోనూ గుబులు రేపుతోంది.

Update: 2026-07-10 08:24 GMT

రాష్ట్రంలో సాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ‌-స‌ర్‌- 50 శాతం కూడా దాట‌క‌పోవడం.. అన్ని పార్టీల్లోనూ గుబులు రేపుతోంది. ఈ నెల 14 నాటికి అంటే.. మ‌రో ఐదు రోజుల్లోనే ఈ ప్ర‌క్రియ‌కు బ్రేక్ ప‌డ నుంది. కానీ.. ప్ర‌స్తుతం 45 శాతానికి మించి ర‌మార‌మి ఎక్క‌డా పుంజుకోలేదు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీకి బ‌లం ఉన్న చోట కూడా ఓటింగ్ శాతం దీనిని నిరూపించుకునేందుకు ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చినా.. సంబంధిత డేటా లేక‌పోవ‌డంతో స‌ర్ ప్ర‌క్రియ మంద‌గించింది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజ‌న ప్రాంతాల్లో అయితే.. 32 శాతం కూడా.. స‌ర్ ప్ర‌క్రియ పూర్తికాలేద‌ని జాబితాలే చెబుతున్నాయి. ఇక‌, న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉన్నా.. ఒకింత మెరుగ్గానే ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. న‌గ‌రాల్లోనూ 50 శాతానికి ఇప్ప‌టి వ‌ర‌కు చేర‌లేదు. 100 శాతం ఫారాలు ఇచ్చామ‌ని ఎన్నిక‌ల సంఘం చెబుతోంది. ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అయినా.. ఓట‌ర్ల నుంచి తిరిగి ఈ ఫారాలు వివరాల‌తో స‌హా అధికారుల‌కు చేరాలి. కానీ, ఇక్క‌డే వెనుక‌బ‌డుతున్నారు.

ఈ విధంగానే వ‌చ్చే నాలుగు రోజులు కూడా ఉంటే.. అది రాష్ట్రంలో ఓటు బ్యాంకును తీవ్ర‌స్థాయిలో ప్ర‌భా వితం చేస్తుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను ముందుకు క‌దిలేలా.. వారికి సంబంధించిన వివ‌రాలు అందేలా చూడాల్సిన బాధ్య‌త పార్టీల‌పైనే ఉంటుంది. కానీ, ఈ దిశ‌గా పార్టీలు చేస్తున్న ప్ర‌య‌త్నం కూడా నామ‌మాత్రంగానే ఉంద‌ని తెలుస్తోంది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు స‌రైన స‌మాచారం లేద‌న్న‌దివాస్తవం. దీనిని అధిగ‌మిస్తేనే పూర్తిస్థాయిలో ఎన్యుమ‌రేష‌న్ పూర్త‌వుతుంది.

ఏం చేయాలి.. ?

పార్టీల‌కు అతీతంగా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని వారి నుంచి ఫారాల‌ను తీసుకోవాలి. వారికి  స‌మాచారం అందించాలి. అదే స‌మ‌యంలో 2002 నాటి ఎన్నిక‌ల జాబితాలో పేర్లు.. ఉంటే స‌రే, లేక‌పోతే ఏం చేయాల‌న్న విష‌యంపైనా అవ‌గాహ‌న క‌ల్పించాలి. ఈ ప‌నిని ఎంత త్వ‌ర‌గా చేస్తే.. అంత మేర‌కు ఓటు బ్యాంకు పెరుగుతుంది. లేక పోతే.. అది అన్నిపార్టీల‌కూ ఇబ్బందేన‌న్న‌ది వాస్త‌వం.

Tags:    

Similar News