భయం పుట్టించేందుకు... ఏపీలో నిందితులకు కొత్త ట్రీట్ మెంట్!
అవును... తప్పు చేయాలంటే భయం కలిగేలా.. పరువు మొత్తం నడిరోడ్డు ఎక్కెలా అన్నట్లుగా ఏపీ పోలీసులు సరికొత్త ట్రీట్ మెంట్ ఇస్తున్నారు!;
నేరం చేసినట్లు రుజువైతే న్యాయస్థానాల్లో శిక్షలు పడతాయి! అంతకంటే ముందే పోలీసులు సరికొత్త ట్రీట్ మెంట్ ఇస్తున్నారు! ఇందులో భాగంగా... సంచలన కేసుల్లో నిందితులను నడి రోడ్డుపై ప్రజలంతా చూస్తుండగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. నేరస్థుల్లో భయం పుట్టించేందుకే నిందితులను ఇలా బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
అవును... తప్పు చేయాలంటే భయం కలిగేలా.. పరువు మొత్తం నడిరోడ్డు ఎక్కెలా అన్నట్లుగా ఏపీ పోలీసులు సరికొత్త ట్రీట్ మెంట్ ఇస్తున్నారు! ఈ క్రమంలో తాజగా నేరస్థుల్లో భయం పుట్టించేందుకు అంటూ నిందితులను ముఖాలకు మాస్కులు లేకుండా నడిరోడ్డుపై నడిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ పోలీసులు అత్యాచారం కేసు, బ్లేడుతో దాడి కేసుల్లో నిందితులను నడిరోడ్డుపై నడిపించారు.
ఇందులో భాగంగా... నెల్లురు లోని బోసుబొమ్మ వద్ద ప్రైవేటు బస్సు డ్రైవర్, కండక్టర్లపై పలువురు యువకులు బ్లేడుతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు! ఈ క్రమంలో వారందరినీ సంతపేట పోలీసులు సోమవారం రాత్రి నగరంలోని రోడ్లపై నడిపించారు. ఈ సందర్భంగా.. వీరు చేసిన, పని.. వీరి పేర్లు వంటి వివరాలను ఇనిస్పెక్టర్ సోమయ్య వెల్లడించారు.
ఈ క్రమంలో... మదన్, శ్రీకంత్, అజయ్, నితిన్, తేజ లు మద్యం తాగి నడి రోడ్డుపై అడ్డంగా బైకులు పార్కింగ్ చేసుకుని మాట్లాడుకుంటుండగా.. హారన్ కొట్టిన బస్సు డ్రైవర్ వాటిని తొలగించాలని చెప్పారు. దీంతో వీరంతా ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ లపై బ్లేడుతో దాడి చేశారని పేర్కొన్నారు.
ఇదే సమయంలో... ఏలూరులో సంచలనం సృష్టించిన యువతిపై అత్యాచారం కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులపైన జగదీష్, భవానీ కుమార్ లతో పాటు వీరికి సహకరించిన ధనుష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో... ప్రజలంతా చూస్తుండగా వీరిని టూటౌన్ పోలీసు స్టేషన్ నుంచి కోర్టు వరకూ బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
ఈ సమయంలో ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరిని జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా స్పందించిన డీఎస్పీ.. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని.. నేరస్థుల్లో భయం పుట్టించేందుకే నిందితులను ఇలా బహిరంగంగా తీసుకెళ్తున్నామని తెలిపారు. దీంతో.. ఇది సరికొత్త ట్రీట్ మెంట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.