వారికి కేబినెట్ హోదా...దసరాతో మొత్తం భర్తీ !

ఏపీలో పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను నియమించారు. అందులో వివిధ కేటగిరీలు కూడా ఉన్నాయి. వీరికి జీత భత్యాలను కూటమి ప్రభుత్వం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-09-04 02:45 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పదిహేను నెలలుగా వరుసగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసుకుంటూ వెళ్తోంది. ఈ విషయంలో మూడు పార్టీలకు తగిన న్యాయం చేస్తోంది. వారికి అసెంబ్లీలో ఉన్న సీట్లను ప్రాతిపదికగా తీసుకుని నామినెటెడ్ పదవులలో వాటాను ఇస్తోంది. ఇందులో సింహ భాగం టీడీపీకే దక్కుతోంది. దాంతో పాటు అనేక ఇతర పదవులలో కూడా కూటమి పార్టీలు నిరాశ చెందకుండా పెద్దన్నగా టీడీపీ చాకచక్యంగా వ్యవహరిస్తోంది.

వారికి కేబినెట్ హోదా :

ఇదిలా ఉంటే తాజాగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక మూడు కీలక నామినేటెడ్ చైర్మన్ పదవులకు కేబినెట్ హోదాని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలా చూస్తే కనుక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ లకు ఈ కేబినెట్ హోదా దక్కింది. వీరు ఇక మీదట రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసినపుడు కానీ సభలు సమావేశాల సందర్భంలో కానీ కేబినెట్ హోదా ప్రోటోకాల్ దక్కుతుంది అని అంటున్నరు.

జీతాలు వారికి ఇవే :

ఏపీలో పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను నియమించారు. అందులో వివిధ కేటగిరీలు కూడా ఉన్నాయి. వీరికి జీత భత్యాలను కూటమి ప్రభుత్వం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ కేటగిరీకి చెందిన పన్నెండు నామినేటెడ్ కార్పోరేషన్ చైర్మన్లకు నెలకు ఒక లక్షా పాతిక వేల జీతంతో ఆటు ఇతర అలవెన్సులు అన్నీ కలిపి చూస్తే రెండు లక్షల 77 వేల 500 రూపాయలు దాకా వారికి లభిస్తుంది. ఇక బీ కేటగిరీలో ఉన్న నామినేటెడ్ చైర్మన్లకు నెలకు అరవై వేల రూపాయల జీతంతో పాటు అలవెన్సులు కూడా కూడితే లక్షా 93 వేల 500 దాకా లభిస్తుంది.

దసరాతో టోటల్ గా ఫుల్ :

ఏపీలో అనేక నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. వాటిలో దాదాపుగా తొంబై శాతం దాకా ఇప్పటికే భర్తీ చేశారు. ఇక మిగిలిన పది శాతాన్ని కూడా ఈ దసరా పండుగ లోగా పూర్తి చేసి నామినేటెడ్ పందేరాన్ని ముగించాలని చూస్తున్నరు. అలా కొన్ని కార్పోరేషన్ల చైర్మన్ పోస్టులను మూడు పార్టీలలో అర్హులైన వారికి ఇవ్వాలని చూస్తున్నారు. ఇక చివరిది ఆఖరిది కావడంతో ఈ పందేరం కోసం పెద్ద ఎత్తున మూడు పార్టీలలో పోటీ ఉందని అంటున్నారు. అయితే కలిసి కూర్చుని చర్చిస్తే ఎవరికి ఏమిటి అన్నది ఒక కొలిక్కి వస్తుంది అని అంటున్నారు. మొత్తానికి నామినేటెడ్ పదవుల పందేరాన్ని సాఫీగా పూర్తి చేసి పూర్తి స్థాయి పాలన మీద దృష్టి పెట్టాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

Tags:    

Similar News