నాకే పాపం తెలియ‌దు.. 7గంట‌ల విచార‌ణ‌లో సాయిరెడ్డి

ఈ కేసులో తాజాగా మ‌రోసారి వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు.

Update: 2026-05-28 20:19 GMT

వైసీపీ పాల‌నా కాలంలో ఏపీలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసు ద‌ర్యాప్తు కీల‌క ద‌శ‌కు చేరుకుంది. ఈ కుంభ‌కోణంలో ఏకంగా 3500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు దారి మ‌ళ్లింద‌ని.. దీనిలో కొంత మొత్తం మ‌నీలాండ రింగ్ కూడా జ‌రిగింద‌ని.. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు 38 మందిని ఈ కేసులో సూత్ర‌, పాత్ర ధారులుగా తేల్చారు. ఏ1గా రాజ్ క‌సిరెడ్డిని పేర్కొన్నారు. ఇటీవ‌లే ఈయ‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ల‌భించింది.

ఈ కేసులో తాజాగా మ‌రోసారి వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. గురువారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు సుమారు 7 గంట‌ల పాటు.. ఆయ‌న‌ను సుదీర్ఘంగా ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన విచార‌ణ‌కు హాజ‌రైన సాయిరెడ్డి.. త‌న కు ఏపాపం తెలియ‌ద‌ని.. తాను ఎప్పుడూ ఈ విష‌యంలో జోక్యం కూడా చేసుకోలేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. త‌న ఉన్న అన్ని ఆధారాల‌ను ఇప్ప‌టికే స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపారని స‌మాచారం.

కాగా.. ఈడీ అధికారులు ఇప్ప‌టికే మూడు సార్లు.. సాయిరెడ్డిని విచారించారు. గ‌త విచార‌ణ‌లో ఆయ‌న ఇం ట్లో సోదాలు కూడా నిర్వ‌హించారు. అనంత‌రం.. గురువారం నాటి విచార‌ణ‌లో మ‌నీలాండ‌రింగ్ కోణంలోనే ఆయ‌న‌ను ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా `పెద్ద‌ల‌` పాత్ర‌పై ఆయ‌న‌ను నిశితంగా ప్ర‌శ్నించిన‌ప్పు డు.. త‌న‌కు తెలియ‌ద‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెప్పిన‌ట్టు స‌మాచారం. అయితే.. మ‌ద్యంలో ఏదో జ‌రుగుతోంద న్న అనుమానం త‌న‌కు వ‌చ్చింద‌ని కానీ.. ఎవ‌రితోనూ తాను ఈ విష‌యాన్ని పంచుకోలేద‌ని ఆయ‌న చెప్పారు.

ఒక రాజ్య‌స‌భ స‌భ్యుడిగా త‌న పాత్ర ప‌రిమిత‌మ‌ని.. పార్టీ కీల‌క నేత‌గా అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కుల‌తో మాట్లాడిన‌ట్టు చెప్పారు. అంత‌కుమించి.. ప్ర‌భుత్వ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు, ముఖ్యంగా మ‌ద్యం, ఇసుక వంటి విష‌యాల జోలికి కూడా తాను పోలేద‌ని.. త‌న‌తో ఎవ‌రూ పంచుకోలేద‌ని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ క‌సిరెడ్డిల‌తో ఒక‌సారి మాత్ర‌మే క‌లిసి కూర్చున్నామ‌ని.. అప్పుడు కూడా తన పాత్ర ప‌రిమిత‌మ ని ఆయ‌న చెప్పారు. తాజా విచార‌ణ అనంత‌రం.. సాయిరెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.

Tags:    

Similar News