స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... కూటమి కీలక నిర్ణయం
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే మన మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ ని తీసుకుని వచింది. దీనితో పాటు స్మార్ట్ రేషన్ కార్డులు కూడా కొద్ది నెలల క్రితం పంపిణీ చేశరు.;
ఏపీలో ఉన్న ఒక కోటీ నలభై లక్షల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల మొతం ఫ్యామిలీకి పెద్ద ఎత్తున మేలు జరగడమే కాకుండా ప్రభుత్వం వద్ద మొత్తం డేటా కూడా ఉంటుంది. అలా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది వచ్చినా వెంటనే అలెర్ట్ అయి సరి చేసే వీలు ఉంటుంది. ఇదంతా పరిపాలనలో సరికొత్త టెక్నాలజీని జత చేసి మరింత వేగంగా పధకాలతో పాటు పౌర సేవలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో అమలు చేయాలని చూస్తున్నారు.
జూన్ లోగా పంపిణీ :
వచ్చే ఏడాది తొలి ఆరు నెలలూ స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ కోసం కేటాయిస్తారు. జూన్ లోగా ఈ స్మార్ట్ కార్డులు అన్నీ అందచేస్తారు. వీటి ద్వరా ఆయా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మీద ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంటుందని భావిస్తున్నారు. ఒక కుటుంబంలోని మొత్తం వివరాలు అన్నీ ఆ ఫ్యామిలీ స్మార్ట్ కార్డులోనే ఉంటాయి. దానికి ఒక క్యూ ఆర్ కోడ్ ని కూడా ఇస్తారు ప్రస్తుతం రేషన్ కార్డుకు ఇచ్చిన మాదిరిగా ఈ క్యూ ఆర్ కోర్డ్ కనుక స్కాన్ చేస్తే ఆ కుటుంబం మొత్తం మెంబర్స్ అందరి వివరాలు పూర్తిగా వస్తాయని అంటున్నారు.
ఇప్పటికే టెక్నాలజీతో :
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే మన మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ ని తీసుకుని వచింది. దీనితో పాటు స్మార్ట్ రేషన్ కార్డులు కూడా కొద్ది నెలల క్రితం పంపిణీ చేశరు. వీటి వలన పౌర సేవలు మరింత సులువుగా జనాలకు అందుతున్నయి. వేగంగా కూడా వారికి దక్కుతున్నాయి. పారదశ్కత కూడా పెరిగింది. దీని వల్ల ప్రతీ కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు. వారికి సంబంధించిన ఆర్ధిక పరమైన సామాజిక పరమైన విషయాలు అన్నీ స్మార్ట్ కార్డు ద్వారా తెలుస్తాయి కాబట్టి వారికి ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేయాలని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరింత సంక్షేమం కోసం :
స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల ద్వారా పక్కాగా వివరాలు అన్నీ తెలియడం వల్ల అర్హులకే సంక్షేమ పధకాలు దక్కుతాయని అంటున్నారు. అంతే కాదు పీ 4 పధకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది పేదలను ముందుకు తీసుకుని వచ్చి వారిని అందరితో సమానంగా తీర్చిదిద్దాలని చూస్తోంది. దానికి కూడా ఈ స్మార్టు కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తోంది. అదే విధంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను ఉపయోగించుకునే ఇక మీదట కుల ధ్రువీకరణ పత్రాలు కానీవ్ రేషన్ కార్డుల పంపిణీ కానీ, సామాజిక పింఛన్లు వివిధ రకాలైన స్కాలర్‌షిప్స్ వంటివి అందించేందుకు వీలు అవుతుందనీ టున్నారు. మరో వైపు వీటిని ఆధార్ కార్డుల వివరాలతో ట్రాక్ చేసేలా రూపొందించాలని చూస్తున్నారు. దాంతో పూర్తి సమాచారం వస్తుందని చూస్తున్నారు.