బిట్వీన్ ద లైన్స్...దిష్టి చుక్క పోయినట్లేనా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరదాగా అన్నారు ఒక మాట. రాజోలు పర్యటనలో అది జరిగింది.;

Update: 2025-12-03 04:03 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరదాగా అన్నారు ఒక మాట. రాజోలు పర్యటనలో అది జరిగింది. నిజానికి పవన్ శంకరగుప్తంలో కొబ్బరి రైతులతో ఏమి మాట్లాడారో లైవ్ వచ్చింది. ఇంకా డౌట్ ఉంటే యూట్యూబ్ లో కూడా దానికి సంబంధించిన వీడియో మొత్తం ఉంది. కోనసీమ కొబ్బరి అని అంటారు. పచ్చదనానికి పెట్టింది పేరు. అందుకే పవన్ దిష్టి తగిలింది అన్నారు. అది కూడా సరదాగానే. ఆ వీడియో చూసిన వారికి అదే అర్ధం అవుతుంది. ఆయన కొబ్బరి రైతుల బాధను చూసి ఓదార్పు మాటలు చెప్పారు. అందులో భాగంగానే ఆయన వారితో ఈ సరదా వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది ఒకే విషయం మీద మాట్లాడుకుంటే దిష్టి తగిలింది అంటారు. అదేమీ పెద్ద తిట్టు కాదు, జనాంతికంగానే అనే మాటగానే చూస్తారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యల మీద రాజకీయ దుమారం రేగుతోంది.

ప్రజలు బాగున్నారు :

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచి సుహుద్భావంతో కలసి మెలసి ఉన్నారని మంచి వాతావరణం ఉందని జనసేన పవన్ తరఫున తాజాగా ఒక ప్రకటన చేసింది. సరదాగా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దు అని కోరింది. కేవలం రెండే రెండు లైన్లతో జనసేన ప్రకటన ఉంది. అయితే బిట్వీన్ ద లైన్స్ అని ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే జనసేన ఎలాంటి వివాదం జోలికి పోదలచుకోలేదని అంటున్నారు. అంతే కాదు ప్రజలు అంతా హాయిగా ఉన్నారు, ఇలాంటి వాటితో ఇబ్బందులు పెట్టడం సమంజసమా అన్నది కూడా అంతరార్ధంగా ఉంది.

అంతా మౌనంగా :

పవన్ ఒక ప్రముఖ సినీ నటుడు. అంతే కాదు ఆయన ఏపీకి ఉప ముఖ్యమంత్రి. ఒక పార్టీ అధినేత. ఆయనను విమర్శిస్తూంటే అటూ ఇటూ కూడా ఒక్కరు కూడా మాట్లాడకపోవడమే అసలైన రాజకీయ విడ్డూరంగా ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇందులో మిత్ర పక్షాలు కూడా ఉన్నాయి. అయినా ఎవరూ కూడా బౌండరీస్ ని దాటి రాలేదని అంటున్నారు. మరి ఈ పరిణామాలు అన్నీ గత కొన్ని రోజులుగా చూసిన తరువాత ఇంకా వ్యవహారం పీక్స్ చేరి ముదిరిపోతున్న నేపధ్యంలో జనసేన ఒక కూల్ స్టేట్మెంట్ ఇచ్చి ఎండ్ కార్డు వేసే ప్రయత్నం అయితే చేసింది.

ఇంతటితో సరిపెడతారా :

ఇక పవన్ కళ్యాణ్ తరఫున జనసేన చేసిన ఈ ప్రకటనతో అయినా ఈ దిష్టి వివాదం సమసిపోతుందా దిష్టి చుక్క పోతుందా ఇక అంతా ఓకేగా ఉంటారా అన్నది ఆలోచించాల్సి ఉంది. అందరూ చెబుతున్నట్లుగా విడిపోయి దశాబ్దం పై దాటింది. అయినా మంచిగా కలసి ఉంటున్నారు. ఈ మంచి వాతావరణాన్ని కలసి ముందుకు తీసుకుని వెళ్తేనే బాగుంటుంది. ఈ మధ్యలో వేరేవి వద్దు అన్నదే కోట్లాది తెలుగు వారి మాట అని అంటున్నారు.

Tags:    

Similar News