బాబు డ‌బ్బులిచ్చారు.. ఏపీలో అన్న‌దాత‌ల‌కు పండ‌గ‌:

దీనికి కేంద్రం ఇచ్చే 2000 రూపాయ‌లు అద‌నం. వెర‌సి మొత్తంగా ల‌బ్ధిదారులైన అన్న‌దాత‌ల ఖాతాల్లో 9000 చొప్పున నిధులు జ‌మ‌య్యాయ‌. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Update: 2026-06-21 04:10 GMT

ఏపీలో అన్న‌దాత‌ల‌కు పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తాజాగా శ‌నివారం సాయంత్రం ప‌ల్నాడు జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో రాష్ట్రంలోని రైతుల‌కు అన్నదాత సుఖీభ‌వ‌-పీఎం కిసాన్ ప‌థ‌కం కింద‌.. సీఎం చంద్ర‌బాబు నిధులు విడుద‌ల చేసింది. ఒక్కొక్క రైతు ఖాతాలోను.. 7000 రూపాయ‌ల చొప్పున నిధులు జ‌మ చేశారు. దీనికి కేంద్రం ఇచ్చే 2000 రూపాయ‌లు అద‌నం. వెర‌సి మొత్తంగా ల‌బ్ధిదారులైన అన్న‌దాత‌ల ఖాతాల్లో 9000 చొప్పున నిధులు జ‌మ‌య్యాయ‌. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌తానికి ఇప్ప‌టికి..

ఇక‌, వైసీపీ హ‌యాంలో కూడా రైతుల‌కు నిధులు ఇచ్చారు. కానీ, అప్ప‌టికి ఇప్ప‌టికి తేడా ఉంద‌ని రైతులు చెబుతున్నారు. అప్ప‌ట్లో సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కిన రెండు మూడు రోజుల వ‌ర‌కు నిధుల కోసం వేచి చూడాల్సి వ‌చ్చింద‌ని గుర్తు చేసుకుంటు న్నారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు నిధులు విడుద‌ల చేయ‌గానే.. రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మైంది. దీంతో వారి సెల్ ఫోన్ల‌కు బ్యాంకుల నుంచి సందేశాలు వ‌చ్చాయి. ప‌ల్నాడులో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు రైతుల సెల్ ఫోన్ల‌కు వ‌చ్చిన సందేశాల‌ను చూపించ‌మ‌నికోర‌డంతో అంద‌రూ త‌మ సెల్ ఫోన్ల‌ను పైకెత్తి మెసేజ్‌లు చూపించ‌డంగ‌మ‌నార్హం.

47 ల‌క్ష‌ల మందికి..

తాజాగా అమ‌లు చేసిన ప‌థ‌కంలో ల‌బ్ధిదారుల సంఖ్య 70వేల మందికి పెంచార‌ని అధికారులు తెలిపారు. దీంతో మొత్తంగా 47 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో రూ.7000 చొప్పున రాష్ట్ర ప్ర‌భుత్వం 3125 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే న‌గ‌దును జ‌మ చేసింది. ఇలా భారీ మొత్తంలో రైతుల‌కు ఇవ్వ‌డం ఇదే తొలిసారి అని కూడా రైతు సంఘాలు తెలిపాయి. గ‌తంలో జ‌గ‌న్‌.. 4 వేల చోప్పున ఇవ్వ‌గా.. ఇప్పుడు ఏడు వేల చొప్పున ఇస్తున్నార‌ని తెలిపారు. ఏడాదికి మూడు సార్లు.. కేంద్రం 2000 చొప్పున‌, రాష్ట్రం 7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేస్తోంది. ఈ ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్‌లో ఇదే తొలి వాయిదా కావ‌డం గ‌మ‌నార్హం. మ‌ళ్లీ అక్టోబ‌రులో నిధుల‌ను ఇవ్వ‌నున్నారు.

Tags:    

Similar News