ఎమ్మెల్యేలకు 'పొలంబాట'.. పెద్ద టెస్టే.. !
కానీ, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సొమ్ము కేవలం 5000 రూపాయలు మాత్రమే. మరో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వేశారు.;
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే `పొలం బాట` కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు గత రెండు రోజులుగా అసెంబ్లీలో ప్రకటిస్తూ వస్తున్నారు. పొలం బాట కార్యక్రమం ద్వారా రైతులకు చేరువ కావాలన్నది చంద్రబాబు ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో ఒకింత ఆగ్రహం నెలకొన్న విషయం తెలిసిందే. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న వాదన బలంగా వినిపిస్తుండడం, అదే సమయంలో యూరియా కొరతపై అసెంబ్లీలో చెప్పినట్టుగా బయట పరిస్థితులు లేకపోవడం వంటివి రైతులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.
మరోవైపు అన్నదాత సుఖీభవ పేరుతో ఇచ్చిన నిధులు కూడా అరకురగానే ఉండడం గమనార్హం. ఏడాదికి 20వేల రూపాయలు చొప్పున రైతులు ఖాతాలో వేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా అన్నదాతలను ఆవేశానికి, ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల సమయంలో చెప్పిన ప్రకారం అయితే ఇప్పటికే రైతుల ఖాతాల్లో కనీసం పాతికవేల రూపాయలు పైన జమ చేసి ఉండాలి. కానీ, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సొమ్ము కేవలం 5000 రూపాయలు మాత్రమే. మరో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వేశారు.
ఇంతకుమించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అన్నదాతలకు ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా నిధులు వేయలేదు. దీంతో రైతులు ఒకంత ఆగ్రహంతో.,.. ఆవేదనతో ఉన్నారు. దీనిని గమనించిన సీఎం చంద్రబాబు పొలంబాట కార్యక్రమం ద్వారా రైతులకు చెరువకావాలని, రైతుల సమస్యలు తెలుసుకోవాలని, తద్వారా వారిని ఊరడించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా సూచించారు. తాను కూడా స్వయంగా రంగంలోకి దిగుతానని చెప్పారు. ప్రతి నెల కనీసం నాలుగు రోజులపాటు అయిన పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టి రైతుల సమస్యలు తెలుసుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం.
అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి. ఎందుకంటే గత రెండు నెలల కిందట పల్లె నిద్ర పేరుతో చేపట్టిన కార్యక్రమం సక్సెస్ కాలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా పల్లెలకు వెళ్ళలేదు. పల్లెలో సమస్యలు తెలుసుకో లేదు. దీంతో అప్పటికప్పుడు కలెక్టర్లను పురమాయించి కొంతమంది కలెక్టర్లను పల్లెలకు పంపించారు. వారు కూడా అయస్టంగానే అక్కడ పర్యటించడం, అక్కడ నిద్ర చేయటం వంటివి తెలిసిందే. దీంతో ఈ కార్యక్రమం ఫైల్ అయింది. ఇప్పుడు దాని స్థానంలో పొలంబాట కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. యూరియాను సరఫరా చేయలేకపోతున్న విషయాన్ని చెప్పుకుంటే ఏ గొడవ ఉండేది కాదు. కానీ యూరియాని వాడితే క్యాన్సర్ వస్తుందని, హానికరమని, పర్యావరణానికి మేలు జరగదని సీఎం చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో చెప్పడం పట్ల రైతు సంఘాలు రైతులు కూడా ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇవ్వ లేనప్పుడు ఇవ్వలేమని చెప్తే తమదారి తాము చూసుకుంటామన్న రైతులు.. ఇలా క్యాన్సర్ వస్తుంది, సమాజానికి మంచిది కాదు అనే విషయాలు ఇప్పుడే తెలిసా అని ప్రశ్నించడం గమనార్హం.
వారి ఆగ్రహాన్ని తగ్గించేందుకు వారి ఆవేశాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొలంబాట కార్యక్రమాన్ని ఎంచుకుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయకపోతే మాత్రం రైతుల ఆగ్రహానికి మరోసారి గురికాక తప్పదు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.