ఏపీ మంత్రులకు తీరికేదీ.. కమిటీలపై కమిటీలు.. !
మరోవైపు.. మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేటలో విదేశాలకు వెళ్లారు. దీంతో ఆయనకుఅప్పగించిన బాధ్యతల తాలూకు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.;
మంత్రుల పరిస్థితి క్షణం తీరిక ఉండడం లేదు. అలాగని పనులు కూడా ముందుకు సాగడం లేదు. సీఎం చంద్రబాబు పదే పదే నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. దీనికి వారికి సమయం ఉండ డం లేదన్నది ప్రధాన సమస్య. ఒకవైపు శాఖల పనితీరును సమీక్షించాలి. మరోవైపు శాఖల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించాలి. అధికారుల పనితీరును అంచనా వేసుకోవాలి. వారిని సరైన మార్గంలో నడిపించాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మంత్రులకు పెద్ద పని.
ఇక, వీటితో పాటు.. సీఎం చంద్రబాబు వేస్తున్న మరో పని.. కమిటీలు. ప్రతిదానికీ మంత్రి ఉపసంఘం పేరుతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో మంత్రులకు చేతినిండా పనిదొరుకుతుందని అనుకున్నా.. వారి సామర్థ్యానికి మించి పనులు అప్పగిస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది. విద్య శాఖకు సంబంధించి మూడు కమిటీలు వేశారు. వీటికి మంత్రి నారా లోకేష్ నేతృత్వం వహిస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆయన నేతృత్వంలోనే కమిటీ వేశారు. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ కమిటీ చర్చించలేదు.
మరోవైపు.. మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేటలో విదేశాలకు వెళ్లారు. దీంతో ఆయనకుఅప్పగించిన బాధ్యతల తాలూకు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ నే తృత్వంలో జిల్లాల కమిటీని ఏర్పాటు చేశారు. అదేసమయంలో ఏ ఇతర కార్యక్రమాలు జరిగినా.. ఉదాహ రణకు జీఎస్టీ సభ.. దీనిలోనూ ఆయన ఉన్నారు. ఫలితంగా జిల్లాల కమిటీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇక, రెవెన్యూ ల్యాండ్ సర్వేపైనా మరో సబ్ కమిటీని నియమించారు. దీనికి కూడా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంది.
అలాగే.. మంత్రి పయ్యావుల కేవశ్‌కు కూడా రెండు నుంచి మూడు కమిటీల నేతృత్వ బాధ్యతలు అప్పగిం చారు. వ్యవసాయ కమిటీ, రైతు మార్కెట్ల కమిటీలు వేసి.. ఆ బాధ్యతలను అచ్చెన్నాయుడికి అప్పగించా రు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు.. ఉద్యోగుల సమస్యలపై కమిటీ బాధ్యతను అప్పగించా రు. అలాగే.. విద్యుత్ శాఖ టారిఫ్‌లకు సంబంధించి నియమించిన కమిటీకి కూడా ఆయనే బాధ్యత వహిస్తున్నారు. హోం మంత్రి అనిత కూడా రెండు మూడు కమిటీల్లో ఉన్నారు.
ఇలా.. మంత్రులకు ఇప్పటికే ఉన్న బాధ్యతలకు తోడు.. మరిన్ని కమిటీల్లో వారిని చేర్చడంతో పనితీరులోనే కాదు.. ఫలితంలోనూ ఆశించిన పురోగతి కనిపించడం లేదన్నది వాస్తవం. దీనిపై సీఎం చంద్రబాబు మార్పు దిశగా అడుగులు వేయాలని మంత్రులు ఆఫ్ దిరికార్డుగా మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.