ఏపీలో మనమిత్ర... సక్సెస్ రేటెంత.. ?
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అమలు చేస్తున్న మన మిత్ర యాప్.. (వాట్సాప్ యాప్ ద్వారా ప్రజలకు అందించే సేవలు) పై మిశ్రమ స్పందన వస్తోంది;
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అమలు చేస్తున్న మన మిత్ర యాప్.. (వాట్సాప్ యాప్ ద్వారా ప్రజలకు అందించే సేవలు) పై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ యాప్ ద్వారా ప్రస్తుతం 210 రకాల సేవలను ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసిందని చెబుతోంది. అయితే.. అన్ని సేవల మాట ఎలా ఉన్నా.. కొన్నయినా.. ప్రజలకుచేరవేయాలన్నది సర్కారు సంకల్పం. తద్వారా.. జగన్ హయాంలో తీసుకువచ్చిన ఇంటింటికీ పాలనను పక్కన పెట్టి ప్రజలకు మరింత చేరువ కావాలని నిర్ణయించింది.
అయితే.. అనుకున్న విధంగా యాప్ ప్రజలకుచేరువ కాలేక పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ 60 శాతం మంది ప్రజలు.. బటన్ ఫోన్లే వాడుతున్నారు. దీంతో వారికి యాప్‌లు.. అనే మాటే వినిపించడం లేదు. ఇక.. నగర ప్రాంతాల్లోనూ డిజిటల్ ఫోన్లు.. వాడుతున్నా.. మనమిత్ర యాప్పై వారికి కూడా అవగాహన లేకుండా పోయింది. ఫలితంగా ప్రజలకు అందించాలన్న డిజిటల్ సేవలు ప్రస్తుతం 20 శాతానికి మించిఉండడం లేదని.. తెలిసింది.
ఇటీవల ఇంటర్ ఫలితాలు, పదోతరగతి ఫలితాలను కూడా... ఆయా బోర్డులు.. వాట్సాప్‌ద్వారానే విడుదల చేశాయి. వాట్సాప్‌లోనే మార్కుల లిస్టులున్నాయనివాటిని చిటికెలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. కానీ.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నగరాల్లోనే 40 శాతం మంది విద్యార్తులకు కూడా.. ఇది డౌన్‌లోడ్ కాలేదని సర్కారుకు నివేదిక అందింది. ఇక, గ్రామీణ ప్రాంతల్లో మరింత ఘోరంగా ఉంది. పైగా.. అందరూ.. కాలేజీలు, స్కూళ్లకే వెళ్లి.. తెచ్చుకున్నారు.
ఇక, పౌర సేవల విషయానికి వస్తే.. అక్కడ కూడా అలానే ఉంది. అనేక వివరాలు కోరడంతోపాటు.. అప్లికేషన్ ఫార్మాట్ కూడా.. డిగ్రీ చదివిన వారికి కూడా ఇక్కట్లు పెట్టేలా ఉండడంతో వాట్సాప్ గవర్నెన్స్ లేదా.. మన మిత్ర యాప్ పెద్దగా ఫలించిన సందర్భాలు లేవు. పైగా.. సిగ్నళ్లు లేని రాని చోట్ల అయితే.. అసలు యాప్ కూడా లేదు. దీనిపై ప్రచారం చేయాలని.. అందరితోనూ. ,. మన మిత్ర యాప్ డౌన్‌లోడ్ చేయించాలని.. చంద్రబాబు చెప్పినా.. అది పెద్దగాకార్యరూపందాల్చలేదు. దీంతో దీనిని సంస్కరించాలని మంత్రులు కూడా చెబుతున్నారు.