జిల్లాల విభజన.. ఎంత వరకు వచ్చిందంటే.. !
అయితే.. జిల్లాల్లో పర్యటించి వివరాలు తెలుసుకునేందుకు, ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకునేందుకు తొలుత జిల్లాల్లో పర్యటించాలని ఈ కమిటీ భావించింది.;
ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన జిల్లా పునర్వ్యవస్థీకరణ, జిల్లాల సరిహద్దులు మార్చే ప్రక్రియ సహా.. పేర్ల మార్పు వంటివి ఎంత వరకు వచ్చింది? మరో 30 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ కమిటీకి తేల్చి చెప్పారు. అయితే.. జిల్లాల్లో పర్యటించి వివరాలు తెలుసుకునేందుకు, ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకునేందుకు తొలుత జిల్లాల్లో పర్యటించాలని ఈ కమిటీ భావించింది.
రోజుకు రెండేసి జిల్లాల్లో అయినా.. పర్యటించాలని కమిటీ నిర్ణయించింది. కానీ, అంత సమయం లేక పోవడంతో ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. దీంతో అమరావతి లేదా.. విజయవాడలోనే ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని.. ఇక్కడ నుంచే మానిటరింగ్ చేసుకోవాలని భావించారు. అయితే.. ఇప్పటి వరకు అనువైన కార్యాలయం ఈ కమిటీకి లబించలేదు. మరోవైపు.. జిల్లాల నుంచి వచ్చే వారికి అవసరమైన వసతులతో కూడిన కార్యాలయాన్ని వెతికే పనిలోనే అధికారులు కూడా ఉన్నారు.
వాస్తవానికి వచ్చే 30 రోజుల్లోనే ఈ కమిటీ నివేదికను రెడీ చేసుకుని. .ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుం ది. ఆ తర్వాత దీనిపై నోటిఫికేషన్ సహా .. ప్రభుత్వం చేయాల్సిన ఫార్మాలిటీస్ కూడా ఉన్నాయి. దీంతో ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే.. అంత ఈజీగా జిల్లాల ఏర్పాటు లేదా మండలాల సరిహద్దుల మార్పు.. వీటికి తోడు.. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు కొత్త పేర్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు త్వరగా పూర్తవుతాయి. ఇదిలావుంటే.. పలువురు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల పేర్ల మార్పు, ఇతరత్రా అంశాలపై వారు అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
అయితే.. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిమాండ్ తెరమీదికి వస్తోంది. ప్రస్తుతం జిల్లాల పేర్లను మార్చాల ని చాలా చోట్ల ప్రజల నుంచి విన్నపాలు అందుతున్నాయి. ఇక, మన్యం జిల్లాను ఇప్పటికే రెండుగా విభ జించగా.. ఇప్పుడు దీనిని మూడు చేయాలని ఇక్కడి ప్రజా ప్రతినిధులు కొరుతున్నారు. అలానే హిందూ పురం జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఇటీవల ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రుల కమిటీకి లేఖ రాశారు. మరోవైపు.. తమ జిల్లాను రెండుగా విభజిస్తే.. ఎలా అంటూ శ్రీసత్యసాయి జిల్లా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా అనేక వివాదాలు.. విమర్శలు కూడా ఉన్న జిల్లాల ఏర్పాటు వ్యవహారం ఎప్పటికి.. పూర్తవుతుందో చూడాలి. కానీ, గడువు మాత్రం మార్చి వరకే ఉంది.