మ‌ద్యంపై మ‌రో పోరు.. టూ సైడ్స్ రిస్కే ..!

రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాల వ్య‌వ‌హారం.. ప్ర‌భుత్వానికి చిక్కులు తెస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదు లు వ‌స్తున్నాయి.;

Update: 2025-06-09 03:45 GMT

రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాల వ్య‌వ‌హారం.. ప్ర‌భుత్వానికి చిక్కులు తెస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌నాభా సంఖ్యపై స‌ర్వే చేయించిన‌ప్పుడు కూడా.. మ‌ద్యం దుకాణాల వ్య‌వ‌హారంపై ప్ర‌జ‌లు ప్ర‌శ్న‌లు లేవనెత్తారు. మూడు ర‌కాలుగా మ‌ద్యం స‌మ‌స్య‌లు స‌ర్కారును ఇర‌కాటం లోకి నెడుతున్నాయి. 1) బెల్టు షాపులు, 2) వైన్స్ ప‌నివేళ‌లు. 3) బార్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు. ఈ మూడు విష యాలు కూడా.. ప్ర‌భుత్వానికి ఇబ్బందిగానే మారాయి.

అయితే.. వీటిని అప్ప‌టికప్పుడు ప‌రిష్క‌రించే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. బెల్టు షాపుల వ్య‌వ‌హారం రాష్ట్రంతో తీవ్ర దుమారం రేపుతోంది. తూర్పు, కృష్ణాజిల్లాల్లో రోడ్ల‌పైనా.. ఇళ్ల ద‌గ్గ‌ర కూడా బాటిళ్ల‌ను బ‌హిరం గంగానే విక్ర‌యిస్తున్నారు. దీనిని క‌ట్ట‌డి చేయాల‌ని వంద‌ల సంఖ్య‌లో ఫిర్యాదులు వ‌స్తున్నాయి. అదేవిధంగా వైన్స్‌లో ప‌నివేళ‌ల‌ను ఉల్లంఘిస్తున్నార‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఉద‌యం 6 గంట‌ల నుంచే వైన్స్‌ను తీసేస్తున్నారు. ఇక‌, బార్ల‌లో ఎంఆర్పీని అస‌లు అమ‌లు చేయ‌డం లేదు.

పైగా ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి 3 గంట‌ల వ‌ర‌కు కూడా బార్ల‌ను తెరిచి ఉంచుతున్నారు. దీంతో స్కూళ్ల‌కు వెళ్లే విద్యార్థులు, మ‌హిళ‌లు కూడా.. ఇబ్బందులు ప‌డుతున్నారు. దీనిపైనా స‌ర్కారుకు పుంఖా ను పుంఖాలుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డుతోంది. పైగా.. గ‌ట్టిగా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం కూడా లేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. దుకాణాలు నిర్వ‌హిస్తున్న‌వారిలో స‌గం మంది కూట‌మి ప్ర‌భుత్వానికి చెందిన వారేన‌న్న చ‌ర్చ ఉంది.

ఈ క్ర‌మంలోనే ఎక్సైజ్ శాఖ‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. `ఎక్సైజ్‌-ఐ` పేరుతో ఒక యాప్‌తీసుకువ‌చ్చింది. దీని ద్వారా కానిస్టేబుళ్ల‌ను ఆయా వైన్స్‌, బార్ల వ‌ద్ద‌కు పంపించి.. ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ.. వీటి వ‌ల్ల కూడా.. ఎలాంటి ఫ‌లితం రావ‌డం లేదు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ ఆదాయానికి గండి ప‌డుతుంద‌ని.. తాము స‌మ‌యం ప్ర‌కారం విక్ర‌యించ‌లేమ‌ని కూడా.. బార్ల య‌జ‌మానులు చెబుతున్నారు. ఈ రెండు స‌మ‌స్య‌ల‌తో ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్న విష‌యంపై స‌మాలోచ‌న చేస్తోంది. అటు కాద‌న‌లేని ప‌రిస్థితి.. ఇటు వ‌ద్ద‌న‌లేని నిస్స‌హాయ‌త కూడా స‌ర్కారుకు ఇబ్బందిగా మారింది.

Tags:    

Similar News