'చిత్రం' సినిమాకు మించి... అతడు 9, ఆమె ఇంటర్!
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో కాలేజీలో చదువుకుంటున్న హీరో, హీరోయిన్ పేరెంట్స్ అవుతారు.;
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో కాలేజీలో చదువుకుంటున్న హీరో, హీరోయిన్ పేరెంట్స్ అవుతారు. అప్పట్లో ఆ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే.. ఆ సినిమాకు మించిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వాస్తవ సంఘటనలో అబ్బాయి 9వ తరగతి చదువుతుంటే.. అమ్మాయి ఇంటర్ చదువుతుందని అంటున్నారు.
అవును... అనపర్తి మండలంలోని ఓ గ్రామంలో ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అబ్బాయి.. ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ప్రేమించుకున్నారంట. ఈ క్రమంలో పలుమార్లు శారీరకంగా దగ్గరయ్యారట. ఫలితంగా ఆ ఇంటర్ అమ్మాయి గర్భవతి అయ్యిందని అంటున్నారు. ఈ క్రమంలో.. నవంబర్ 14న ఆ అమ్మాయి ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతున్నారు.
దీంతో.. విషయం తెలుసుకున్న బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు! అయితే... ఈ కేసులో ఇద్దరూ మైనర్లు కావడంతో ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె బిడ్డకు జన్మనివ్వడంతో గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగిందంట.
ఈ సమయంలో... ఆ బిడ్డతో తమకు ఎలాంటి సంబంధం లేదని బాలుడు తల్లితండ్రులు గట్టిగా చెబుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని బాలిక తల్లితండ్రులు జిల్లా ఎస్పీని కలిశారని తెలుస్తోంది. పుట్టిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలని.. తద్వారా అసలు విషయాలు తెలుస్తాయని వారు కోరినట్లు సమాచారం!
దీంతో... ఈ వ్యవహారం జిల్లాలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. పాఠశాలలో లైంగిక విద్యను బోధించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలిసీ తెలియని వయసులో ఇలాంటి నిర్ణయాలు, పనుల వల్ల సమాజం దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. అడల్ట్ కంటెంట్ విచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్న ఈ నేపథ్యంలో.. ఇలాంటి పరిణామాలకు అవి కూడా ఒక కారణం అని అంటున్నారు!