అమరావతిపై ఎమ్మెల్యేల బాధ్యత లేదా? ఏం చేయాలి?
అయితే.. ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలా చెబుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం వస్తున్నా.. ఇది క్రీమీలేయర్ వర్గానికి మాత్రమే పరిమితం అవుతోంది.;
ఏపీ రాజధాని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యో గాలు కల్పిస్తున్నామని.. దీనికి కొంత సమయం పడుతుందని సీఎం చంద్రబాబు తాజాగా పార్టీ నాయకు లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిని తన మాటల్లో ఆవిష్కరించారు. నిజానికి చంద్రబా బు అమరావతిపై ఎక్కడ అవకాశం వచ్చినా మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడ చాన్స్ చిక్కినా.. చంద్రబాబు రాజధానిపై ప్రచారం చేస్తున్నారు.
అయితే.. ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలా చెబుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం వస్తున్నా.. ఇది క్రీమీలేయర్ వర్గానికి మాత్రమే పరిమితం అవుతోంది. ఉన్నతస్థాయి వర్గాలకు మాత్రమే చంద్రబాబు పే రు, ఊరు.... అమరావతిపై ఆయన చేస్తున్న ప్రచారం చేరుతోంది. కానీ, వాస్తవానికి తెలియాల్సింది.. గ్రామీ ణ స్థాయి, దిగువ మధ్యతరగతి వర్గాలకు. కానీ, వీరికి చేరువ కావడం లేదు. పైగా.. రాజధానిని ఏకీకృతం చేస్తున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
ఈ దిశగా ప్రచారం చేయాల్సిన బాధ్యత.. అమరావతిని విశ్వనగరంగా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారన్న వాదనను బలంగా వినిపించాల్సింది.. ఎమ్మెల్యేలే. అయితే.. ఆదిశగా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు పూనుకో లేదు. పైగా రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లడం లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో రాజధాని వ్యవహారాలు.. భవిష్యత్తు ఆశలు.. రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయికి చేరు తుందన్న వాదన కూడా.. కేవలం చంద్రబాబు సహా కొద్ది మందికే పరిమితం అవుతోంది.
ఇది సరైన విధానం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంటికో పువ్వు.. ఈశ్వరుడికోమాల.. అన్న చం దంగా నాయకులు ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. అమరావతికి బ్రాండ్ చంద్రబాబే అయినా.. దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత, అవసరం రెండూ కూడా రాష్ట్రంలోని కూటమి పార్టీల ఎమ్మెల్యేలపై ఉంది. క్షేత్రస్థాయిలో వారు ప్రయత్నం చేస్తే.. ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ.. వారు చేస్తారా? లేదా? అన్నది చూడాలి.