కాంగ్రెస్ గుండెల్లో బాంబులు పేలుస్తున్న ఏలేటి !

ఉత్తమ్‌పై 'యూ' ట్యాక్స్ ఆరోపణలు సరికాదంటూ మహేశ్వర్ రెడ్డి మీద కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై కేసు నమోదయింది.

Update: 2024-05-23 17:26 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రులకు బీజేపీ శాసనసభా పరేష్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొరకరాని కొయ్యలా మారాడు. రోజుకో బాంబు పేలుస్తూ వారిని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ కు తోడుగా తెలంగాణలో కొత్తగా 'యూ' ట్యాక్స్ మొదలయిందని సంచలనం రేపాడు.

ఉత్తమ్‌పై ‘యూ’ ట్యాక్స్ ఆరోపణలు సరికాదంటూ మహేశ్వర్ రెడ్డి మీద కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై కేసు నమోదయింది. ఈ అంశంపై మహేశ్వర్ రెడ్డి స్పందించాడు. రైస్ మిల్లర్ల నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వింటాలుకు రూ.216 డిమాండ్ చేశాడు. నా వద్ద పూర్తి సమాచారం ఉంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. నేను చెప్పింది వాస్తవం కాబట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయాలో తెలియక నా కేసులు పెట్టించాడు అని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డాడు.

నేను చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో కమిటీ వేస్తే దానికి సంబంధించిన ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమని మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు.

ధాన్యం సేకరణకు సంబంధించి 25-01-24న ఇచ్చిన జీవోలో టెండర్ ప్రాసెసింగ్ చేయాలని చెప్పారని... అదేరోజు గ్లోబల్ టెండర్ పిలిచారన్నారు. గ్లోబల్ టెండర్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారని... అదేరోజు కొంతమంది మిల్లర్లను పిలిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారో ఆధారాలతో బయటపెట్టమంటారా? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించాడు.

Read more!

క్వింటాల్‌కు రూ.216 చొప్పున 35 లక్షల మెట్రిక్ టన్నులకు గాను రూ.800 కోట్ల మేర వసూలు చేశారా? లేదా?. రెండు నెలలు అవుతున్నప్పటికీ ధాన్యాన్ని ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో చెప్పాలి. లక్ష మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని క్వింటాలుకు రూ.2,259కి కొనుగోలు చేసి... 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని క్వింటాలుకు రూ.5,700 పెట్టి కొనడం ఏంటి ? ఇందులోని మతలబు ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. ఈ సవాళ్లు ఎక్కడికి దారితీస్తాయోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Tags:    

Similar News