గాల్లో గొడవలు... 11ఏ సీటు కోసమంటూ ఏమిటీ వీడియోలు?

అవును... తాజాగా ఓ విమానంలో గందరగోళ ఘర్షణ జరిగినట్లు చూపించే ఓ వీడియో వైరల్‌ గా మారింది.;

Update: 2025-06-19 12:30 GMT

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మృతి చెందారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ప్రయాణికుడు విశ్వాస్ ఆ విమానంలో 11 ఏ సీటులో కూర్చున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఆ సీటుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ఈ క్రమంలో.. ఆ సీటు కోసం అదనపు డబ్బు చెల్లించడానికి కూడా ప్రయాణికులు సిద్ధపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకునేవారికి ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనున్న సీటే ఫస్ట్ ప్రియారిటీ అని అంటున్నారు. ఈ సమయంలో.. తాజాగా ఓ విమానంలో 11 ఏ సీటు కోసం మాటల యుద్ధం జరిగిందని చెప్పేలా ఓ (ఫేక్!) వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది!

అవును... తాజాగా ఓ విమానంలో గందరగోళ ఘర్షణ జరిగినట్లు చూపించే ఓ వీడియో వైరల్‌ గా మారింది. ఇది వీక్షకులను ఏ మేరకు కలవరపెడుతుందో తెలియదు కానీ.. ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుందని మాత్రం అంటున్నారు! ఇది ఏ విమానంలోనూ జరగలేదు.. ఇది వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో జరుగుతున్న ప్రయత్నం అని చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం ఈ ఫైట్ 11ఏ సీటు చుట్టూ తిరుగుతుందని నమ్ముతున్నారు!

కాగా... అహ్మదాబాద్ లో ఎయిరిండియా ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత 11ఏ సీటు ప్రత్యేకత వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది సోషల్ మీడియా క్రియేటర్స్ ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకోవడానికి ఇలాంటి వీడియోలు విడుదల చేస్తున్నారని అంటున్నారు. మరికొంతమంది మరింత నేచురల్ గా ఉండేందుకు... సినిమా షూటింగులకు వేసే విమానం సెట్ లను వాడుకుంటున్నారట!

అయితే... ఇలాంటి వీడియోలు చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నిజంగా అలాంటి ఘటనలు ఏమైనా జరిగితే వాటికి అధికారిక ధృవీకరణ ఉండొచ్చని.. అలాకానిపక్షంలో ఇవన్నీ కొంతమంది నెటిజన్లు చేసే పబ్లిసిటీ ప్రయత్నాల్లో భాగంగానే చూడాలని సూచిస్తున్నారు. ఇలాంటి వీడియోలు గత కొంతకాలంగా రెగ్యులర్ గా నెట్టింట హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News