బీహార్‌లో హంగ్ ....పీక్స్ లో డిస్కషన్స్

ప్రస్తుతం అన్నీ ఊహాగానాలే అని బీహార్ ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు అని ఆయన అన్నారు.;

Update: 2025-11-09 04:30 GMT

బీహార్ లో తొలి విడత పోలింగ్ అయితే ఒక జాతరలా సాగింది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతానికి భిన్నంగా వృద్ధులు వికలాంగులు సహా అనేక మంది ఇంటి నుంచి కదిలి వచ్చి ఓట్లు వేశారు. ఇది ఒక మార్పునకు నిదర్శనం అని మహా ఘట్ బంధన్ నేతలు విశ్లేషిస్తూంటే కాదు ఇది ప్రో ఇంకెంబెన్సీ అని ఎన్డీయే నేతలు చెబుతున్నారు. ఆ ఓట్లు అన్నీ మావి అంటే మావి అని రెండు కూటముల నేతలు వాదులాడుకుంటున్నారు. అయితే ఇంకా అసలైన కురుక్షేత్రం ఉండనే ఉంది. ఈ నెల 11న మలి విడత తుది విడత పోలింగ్ బీహార్ లో జరగనుంది. ఈ పోలింగ్ అసలైన డిసైడింగ్ ఫ్యాక్టర్ అని అంటున్నారు. ఆ మీదట బీహార్ కింగ్ ఎవరో తేలుతుంది అని అంటున్నారు.

హంగ్ అంటూ ప్రచారం :

బీహార్ లో రాజకీయ పరిస్థితి చూస్తే మామూలుగా ఏమీ లేదు, సాధారణంగా రాజకీయాలలో గివ్ అప్ అని ఏమీ ఉండదు అటూ ఇటూ చివరి దాకా పోరాడుతారు. ఇపుడు జాతీయ స్థాయిలో కూడా విశేష ప్రభవం చూపించే ఎన్నికకగా బీహార్ ఉండడంతో అంతా అక్కడే మోహారించారు. అన్ని రకాల శక్తి యుక్తులను వాడుతున్నారు. దాంతో హోరా హోరీ పోరే సాగుతోంది. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు హంగ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని దానిని కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే పరిస్థితి ఏమిటి అన్నదే వాడి వేడి చర్చగా ఉందిట.

మజ్లీస్ కి చాన్స్ :

ఇక హంగ్ వంటి సందర్భాలు ఎదురైనపుడు మజ్లిస్, అలాగే జన సురాజ్ ఇతర చిన్న పార్టీలకు యమ డిమాండ్ ఏర్పడుతుంది అని అంటున్నారు. ఈ పార్టీలకు వచ్చే సీట్లే అత్యంత కీలకం అవుతాయని అంటున్నారు. బీహార్ లో హంగ్ వస్తే జన సురాజ్ అలాగే మజ్లీస్ పార్టీలు వ్యవహరించే తీరు మీద కూడా చర్చ సాగుతోంది. దీని మీద మజ్లీస్ అధినేత ఒవైసీ అయితే స్పందిస్తున్నారు. ప్రచారం సాగుతున్నట్లుగా బీహార్ లో హంగ్ అంటూ ఏర్పడితే కనుక ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆయన తాజాగా వెల్లడించారు.

పొత్తులు ఎత్తులు అపుడే :

ఇక బీహార్ లో హంగ్ అసెంబ్లీ అన్నది కనుక ఏర్పడితే ఎన్నికల ఫలితాల అనంతరమే తమ పొత్తులు ఎత్తులు ఉంటాయని ఆయన స్పష్టంగా చెప్పేస్తున్నారు బీహార్ లో తమ పార్టీ ఈసారి మంచి ప్రభావం చూపిస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. తమ పార్టీ విషయంలో మహా ఘట్ బంధన్ చేస్తున్న విమర్శలను కూడా ఆయన గట్టిగానే తిప్పికొడుతున్నారు. తాము బీజేపీకి బీ టీం అని అంటున్నారని అది తప్పుడు ప్రచారం అని అయన అన్నారు. దేశంలో మూడు సార్లు బీజేపీ గెలిచిందని దానికి కారకులు ఎవరని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ ని ఇతర పార్టీలని ప్రశ్నించారు. బీజేపీని నిలువరించలేని వారు తమ మీద విమర్శలు ఎలా చేస్తారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

రిజల్ట్ ఏంటో తెలియదు :

ప్రస్తుతం అన్నీ ఊహాగానాలే అని బీహార్ ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు అని ఆయన అన్నారు. ఫలితాలు తరువాత హంగ్ వస్తే అపుడు తాము మహా ఘట్ బంధన్ తో కలిసే విషయం మీద నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఈసారి ఎక్కువ సీట్లు తాము గెలుస్తామని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. ఇలా ఫలితాల సరళిని బట్టి ప్రజా తీర్పు ఎలా ఉందో చూసుకుని తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు.

జన సూరజ్ సైతం :

ఇక జన సూరజ్ పార్టీకి అర్బన్ ఏరియాలలో కొంత ఊపు కనిపిస్తోంది. ఎన్ని సీట్లు గెలుస్తారు అన్నది అయితే తెలియదు. ఒక వేళ హంగ్ అంటూ వస్తే కనుక ఈ చిన్న పార్టీ కూడా విపరీతమైన ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు. అసలే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ కి కొత్తగా వ్యూహాలు చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే బీహార్‌లోని ప్రతిపక్ష కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధాన భాగస్వాములుగా ఉండగా, ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ఉన్నాయి.

Tags:    

Similar News