డిజిటల్ యుగంలో చట్టాలు సరిపోవా.. దాని అవసరం తప్పనిసరా?

హీరోలు కోర్టుల చుట్టూ తిరిగి తమ డిజిటల్ హక్కులను కాపాడుకోవాలని చూడటం మంచి ప్రయత్నమే అయినా, అది కొందరిపైనే పని చేస్తుంది.

Update: 2026-07-17 05:34 GMT

సినీ హీరోల ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తూ సోషల్ మీడియా కామెంట్లు, మీమ్స్ రూపంలో వస్తున్న మార్ఫింగ్ ఫోటోల వెల్లువను కేవలం పోలీసు కేసులతో అడ్డుకోగలమా? నిమిషానికి లక్షల సంఖ్యలో అప్‌లోడ్ అయ్యే డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించడంలో చట్టాలు వెనుకబడుతున్నాయి. కేవలం ఐటీ యాక్ట్‌లు, ఎఫ్‌ఐఆర్‌ల మీదే ఆధారపడకుండా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తమ అల్గారిథమ్స్ ను మార్చాల్సిన సమయం వచ్చింది. ఫేస్-రిప్లేస్ కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించే పటిష్టమైన ఏఐ వ్యవస్థల ద్వారానే ఈ సాంఘిక ముప్పుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు..

చట్టాల పరిమితులు - మారిన డిజిటల్ స్పీడ్:

హీరోలు కోర్టుల చుట్టూ తిరిగి తమ డిజిటల్ హక్కులను కాపాడుకోవాలని చూడటం మంచి ప్రయత్నమే అయినా, అది కొందరిపైనే పని చేస్తుంది. ఒక అకౌంట్‌పై కేసు పెడితే, నిమిషాల్లో వంద కొత్త ఫేక్ అకౌంట్లు పుట్టుకొచ్చే డిజిటల్ ప్రపంచంలో మనం ఉన్నాం. ఇక ఇంటర్నెట్ సరిహద్దులు లేనిది అని అందరికి తెలుసు, ఒక మూలన కూర్చుని ఎవరో చేసే అసభ్యకరమైన మార్ఫింగ్‌ను కనిపెట్టడం, వారిపై చర్యలు తీసుకోవడం పోలీసు వ్యవస్థకు కూడా కత్తిమీద సామే. అందుకే కేవలం చట్టపరమైన చర్యలు ఈ వేగాన్ని అందుకోలేకపోతున్నాయి అన్నది కొందరి వాదన.

టెక్నాలజీ సమస్యకు టెక్నాలజీనే పరిష్కారం:

ఇక మన ఫోన్‌లలో ఫేస్ లాక్ ఫీచర్ ఎంత వేగంగా పనిచేస్తుందో మనకు తెలుసు. మరి అంతటి అధునాతన ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉన్న ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సంస్థలు మార్ఫింగ్ స్టికెర్స్, GIFsను ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి? ఏఐ ఆధారిత ఫిల్టర్లను కామెంట్ల సెక్షన్‌లో పెట్టడం ద్వారా, అసభ్యకరమైన ఫేస్ రిప్లేస్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసేటప్పుడే ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయవచ్చు. ఇక ప్లాట్‌ఫారమ్‌లు తమ లాభాల కోసం కాకుండా, యూజర్ల గౌరవం కోసం ఈ దిశగా అల్గారిథమ్స్‌ను మార్చాలి.

ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యత - కొత్త ఒత్తిడి:

సోషల్ మీడియా యాప్‌లు కేవలం ఒక వేదికగా మాత్రమే కాకుండా, అక్కడ జరిగే సైబర్ నేరాలకు కూడా బాధ్యత వహించేలా కొత్త గ్లోబల్ పాలసీలు రావాలి. పోస్ట్ చేసే కంటెంట్ కంటే కామెంట్ల ద్వారానే ఎక్కువ విషం చిమ్ముతున్న ఈ రోజుల్లో, కామెంట్ సెక్షన్ మానిటరింగ్ కోసం ప్రత్యేక ఏఐ టూల్స్ వాడటం అత్యంత కీలకం. ఇక టెక్నాలజీ దిగ్గజాలు మనసు పెడితే, ఏ ముఖాన్ని ఎవరు ఎక్కడ తప్పుడుగా వాడుతున్నారో క్షణాల్లో గుర్తించి డిలీట్ చేయడం చాలా సులభమైన పని.

స్టార్ హీరోలు వ్యక్తిగత హక్కుల కోసం పోరాడటం ఎంత ముఖ్యమో, ఇన్‌స్టాగ్రామ్ వంటి సంస్థలపై టెక్నికల్ మార్పుల కోసం ఒత్తిడి తేవడం అంతే ముఖ్యం. ఈరోజుల్లో ఏఐ టెక్నాలజీ ఎంతలా అడ్వాన్స్ అయిందో అందరికి తెలుసు, మరి అలంటి అప్పుడు చెడును అడ్డుకోవడానికి లాఠీ కంటే పటిష్టమైన 'ఏఐ కోడింగ్' తోనే అడ్డుకట్ట వేయచ్చు అన్నది నిపుణుల మాట. ఇక చట్టం తన పని తాను చేస్తుంది, కానీ టెక్నాలజీ తన అల్గారిథమ్‌ను మార్చుకున్నప్పుడే ఈ మార్ఫింగ్ సంస్కృతికి శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది.

Tags:    

Similar News