ప్రమాద స్థలంలో అగ్నిగోళం.. నడుచుకుంటూ వచ్చేస్తున్న మృత్యుంజయుడు.. వీడియో!

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-16 11:26 GMT
ప్రమాద స్థలంలో అగ్నిగోళం..  నడుచుకుంటూ వచ్చేస్తున్న మృత్యుంజయుడు.. వీడియో!

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకేఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ గాయాలతో సజీవంగా బయటపడ్డారు. ఈ క్రమంలో అతనికి సంబంధించిన మరో వీడియో తాజాగా నెట్టింట సంచలనంగా మారింది.

అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్యరీతిలో ప్రాణాలతో బయటపడ్డారు మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్. ప్రమాదం అనంతరం ఆయన నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కిన దృశ్యాలు ఇటీవల నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఆయన సీటు నెంబర్ ఏ11 కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పైగా ఇటీవల విమాన టిక్కెట్ల బుక్కింగ్స్ లో ఏ11 సీటుకు డిమాండ్ పెరిగిందని.. అవసరమైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనుండే ఆ సీటుకు అదనంగా చెల్లించడానికి పలువురు సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో విశ్వాస్ కుమార్ కు సంబంధించిన మరో వీడియో బయటకొచ్చింది. ఓపక్క అగ్నికిలలు ఎగసిపడుతుంటే.. పక్కనుంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు రమేష్!

వాస్తవానికి విమానం ప్రమాదానికి గురైన అనంతరం.. తెలుగు రంగు టీషర్ట్ ధరించిన ఓ వక్తి గాయాలతో, చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రోడ్డుపైకి రావడం.. అనంతరం విషయం చెప్పడం.. అతనిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించడానికి సంబంధించిన వీడియో తొలుత వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలో తాజాగా బయటకు వచ్చిన వీడియోలో... విమానం కూలిన వెంటనే అగ్నిగోళం మండుతుండగా, నల్లని పొగ అంతెత్తున చుట్టూ అలుముకోగా.. వాటి పక్కనుంచి విశ్వాస్ కుమార్ నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ వీడియో మరింత సంచలనంగా మారింది. ఇది చూసినవారు.. ఇతడు నిజంగానే మృత్యుంజయుడు అని పునరుధ్ఘాటిస్తున్నారు.

కాగా... ఈ నెల 12న ఘోర ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో ఏ11 సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్... విమానం కూలగానే తన సీటు ఎగిరి బయట పడిందని.. ఆ సమయంలో తన పక్కన మృతదేహాలున్నాయని.. తాను బయట దూరంగా పడటం వల్లే మంటలు అంటుకోలేదని చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం.. అతడు శిథిలాల నుంచి లేచి నడుచుకుంటూ వచ్చినట్లు తెలిపారు.

Tags:    

Similar News