రాజీవ్ గాంధీని ఎలా చంపాలో శిక్ష‌ణ ఇచ్చిన వ్య‌క్తి మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుమారు 32 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన శాంతన్... 2022లో విడుదలయ్యాడు.

Update: 2024-02-28 05:30 GMT

భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుతేంద్ర రాజా అలియాస్ శాంతన్ (56) ఈ రోజు మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పోందుతున్న ఆయన.. ఈ ఉదయం చెన్నైలోని "రాజీవ్ గాంధీ" గవర్న మెంట్ జనరల్ ఆసుపత్రిలో మరణించాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుమారు 32 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన శాంతన్... 2022లో విడుదలయ్యాడు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్టైన 32 ఏళ్ల తర్వాత 2022లో విడుదలైన శాంతన్... అప్పటి నుంచీ తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి సెంట్రల్ జైలు క్యాంపస్ లోని ప్రత్యేక శిబిరంలో ఉంచబడ్డాడు. ఈ క్రమంలో చెన్నైలోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అతడిని బహిష్కరించాలని ఈ నెల 23న ఉత్తర్వ్యులు జారీ చేయగా... మరో రెండు రోజుల్లో అతడిని శ్రీలంకకు పంపించనున్నారని అంటున్నారు.

గతంలో శ్రీలంకలోని ఎల్.టీ.టీ.ఈ.లో పని చేసిన శాంతన్.. ను మరో రెండు రోజుల్లో శ్రీలంకే పంపేయాలని నిర్ణయించారు! ఈలోపు అతడు అనారోగ్య కారణాలతో రాజీవ్ గాంధీ గవర్న మెంట్ ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 28 ఉదయం 7:50 గంటల ప్రాంతంలో అతను గుండెపోటుతో మరణించాడని వైద్యులు ప్రకటించారు! అతడు... క్రిప్టోజెనిక్ సిర్రోసిస్ అనే వ్యాదిలో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

ఇతని భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం శ్రీలంకలోని ఇంటికి తీసుకెళ్లనున్నారని.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. అతను మరణించే సమయానికి ఆస్పత్రిలో అతని సోదరుడు ఉన్నారని అంటున్నారు.

Read more!

కాగా... రాజీవ్ గాంధీ హత్య కేసులో నలుగురు దోషులు... రాబర్ట్ పయాస్, మురుగన్ అలియాస్ శ్రీహరన్, జయకుమార్ - శాంతన్ లు విడుదలైన తర్వాత వెల్లూరు జైలు నించి తిరుచ్చి సెంట్రల్ జైలు క్యాంపులో ఉన్న ప్రత్యేక శిభిరానికి తరలించబడ్డారు. ఈ క్రమంలో తాజాగా మృతి చెందిన శాంతన్ ను 1990లో ఎల్.టీ.టీ.ఈ స్పాన్సర్ చేసిన స్టూడెంట్ గా ఇండియాకు వచ్చాడు.

ఈ సమయంలో శ్రీపెరంబుదూర్ మైదానంలో రాజీవ్ గాంధీ హత్య జరిగిన సమయంలో ఆ బృందంతో లేనప్పటికీ... అతడు బయటే ఉండి, ఏదైనా తప్పు జరిగితే ఎల్.టీ.టీ.ఈ. హ్యాండ్లర్ కు తెలియజేసేందుకు ఏర్పాటు చేయబడ్డాడు! దీంతో... అతనికి హత్య కుట్ర గురించి తెలుసు.. ఇదే సమయంలో అతడు హంతకులకు ఆశ్రయం కూడా కల్పించడంలో దోషిగా ఉన్నాడని ఈ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News