బీజేపీకి జెన్ జీ జై .....వాటే సర్ ప్రైజ్ !
ఇదిలా ఉంటే ప్రతిపక్షాల వల్ల కానిది జెన్ జీ ఉద్యమంతో కేంద్రంలో ఒక బలమైన బీజేపీ మంత్రి రాజీనామా జరిగింది అని అంతా విశ్లేషించారు.
బీజేపీని అందుకే అంతా మెచ్చుకుంటారు. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడంలో ఆ పార్టీ తరువాతనే ఎవరైనా అని చెప్పాల్సి ఉంది. బీజేపీ 1984లో కేవలం రెండు ఎంపీ సీట్లకే పరిమితం అయి ఇక పని సరి అన్నంతగా దెబ్బ తిన్నది. అయితే కేవలం అయిదేళ్ల తేడాలోనే 88 సీట్ల దాకా ఎగబాకింది. 1984 నుంచి సరిగ్గా పుష్కర కాలం తరువాత దేశాన్ని ఏలేందుకు రెడీ అయి 13 రోజుల పాటు కేంద్రంలో వాజ్ పేయి నాయకత్వాన రెడీ అయి తొలి ప్రభుత్వాన్ని స్థాపించింది. ఇక దేశంలో ఫ్రంటులు కట్టి తమకు అధికారం దక్కకుండా చేస్తున్న నేపధ్యంలో తానే ఒక బలమైన ఫ్రంట్ కడితే పోలా అనుకుంది. అదే ఎన్డీయే. అలా బీజేపీ దేశాన్ని గతంలో ఆరేళ్ళు ఇపుడు పదిహేనేళ్ళు అంటే రెండు దశాబ్దాల పాటు పాలించే సామర్థ్యాన్ని సాధించింది అంటే అందులో బీజేపీ రాజకీయ నీతి ఒక్కటే ఉంది. అది పోయిన చోటను వెతుక్కోవడం.
జెన్ జీ దెబ్బ అంటూ :
ఇదిలా ఉంటే ప్రతిపక్షాల వల్ల కానిది జెన్ జీ ఉద్యమంతో కేంద్రంలో ఒక బలమైన బీజేపీ మంత్రి రాజీనామా జరిగింది అని అంతా విశ్లేషించారు. అంతే కాదు ఇక మీదట బీజేపీ రాజకీయ నడకకు పల్లేరు ముల్లు మాదిరిగా జెన్ జీలు అడ్డుపడతారు అని ఆ జోరు తగ్గి విపక్షం నెగ్గి కేంద్రంలో అధికారం అందుకోవడమే తరువాయి అని అనుకున్నారు. అయితే బీజేపీ పెద్దల మేధో మధనం, ఆర్ఎస్ఎస్ నవ యువ గీతం మోడీ జెన్ జీ స్లాంగ్ అన్నీ కలిసి కొత్త యువతను కూడా కాషాయం ఆకట్టుకుంది అని అంటున్నారు. దాని ఫలితాలు ఇంత తొందరగా కనిపించాయా అంటే ఎదురుగా ఢిల్లీ వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వ విద్యాలయంలో బీజేపీలో విద్యార్థి అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ ఘన విజయం సాధించడం అని గుర్తు చేస్తున్నారు.
సీజేపీ ఉద్యమం నేపధ్యంలో :
ఒక వైపు రెండు నెలల పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఊపిరి ఆడనీయకుండా చేసిన సీజేపీ ఉద్యమం కళ్ళ ముందే ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల సమూహం అంతా కలసి కేంద్రం మీద కన్నెర్ర చేసిన సంఘటనలు కూడా ఇటీవలనే చోటు చేసుకున్నాయి. అలాగే జెన్ జీల ఉద్యమాలు కూడా దేశంలో అన్ని చోట్లా కనిపిస్తూ ఉనికి బలంగా చాటుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంతలా జెన్ జీ యువత గళాలు బలంగా విస్తరించిన నేపధ్యంలో ఢిల్లీ వర్శిటీలో ఏబీవీపీ విజయాన్ని ఒక గొప్ప సర్ ప్రైజ్ గానే అంతా చూస్తున్నారు.
గొప్ప మలుపుగా :
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ డీయూఎస్ యూ ఎన్నికల ఫలితాలు ఏబీవీపీకి అనుకూలంగా వచ్చాయి. మొత్తం నాలుగు కీలక పదవులలో మూడు ఏబీవీపీ పరం అయ్యాయి. అధ్యక్షుడుగా ఎశ్ దబాస్, కార్యదర్శిగా రియా చవ్దీ, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవిని ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నప్పటికీ ఎన్ఎస్ యూఐ నాలుగు కీలకమైన పోస్టులలో ఒక్క దానినీ గెలుచుకోకపోవడం గమనార్హం. రాహుల్ గాంధీ అయితే సీజేపీ ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. జెజ్ జీ యువతతో ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు. మరి ఫలితం చూస్తే ఏబీవీపీ వైపు ఉండడం విశేషం అంటున్నారు.
జెన్ జీ మద్దతు :
ఇక ఢిల్లీ విద్యార్ధి సంఘమే కాదు పంజాబ్ యూనివర్శిటీ విద్యార్ధి సంఘం ఎన్నికల్లో కూడా ఏబీవీపీ ఎస్ ఓ ఐ మద్దతు ఉన్న వారే అధ్యక్ష పీఠం ఎక్కారు. దీనిని బట్టి చూస్తే జెన్ జీ ఉద్యమాలు ఇంత జోరుగా ఉన్నా సీజేపీ వంటివి బీజేపీకి ఎదురు నిలిచినా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ యువతకు దూరం అని ప్రచారం చేసినప్పటికీ ఈ రకమైన ఫలితాలు రావడంతో కమలం పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తమ వైపే జెన్ జీల మద్దతు అని సంబరపడుతోంది. ఏకంగా కేంద్ర మంత్రులు అమిత్ షా కిరణ్ రిజిజు వంటి వారు ఏబీవీపీ గెలుపు పట్ల స్పందించారు అంటే ఈ విజయం ఎంతటి విలువైనది అన్నది అర్థమవుతుంది. దేశంలో యూపీ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ ఫలితాలు ఈ సంకేతాలు యూత్ విత్ బీజేపీ అన్నట్లుగా బలంగా వెళ్తాయని కమలం పార్టీ నమ్ముతోంది.