పౌర్ణమి పూజల వేళ మహా విషాదం... భక్తులతో వెళ్తున్న ట్రక్టర్ బోల్తా!

Update: 2024-02-24 16:42 GMT

పౌర్ణమి రోజున కుటుంబ సమేతంగా గంగానదిలో స్నానమాచరించి.. అనంతరం దేవుడి దర్శనానికి బయలుదేరిన భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఇందులో భాగంగా... అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా సుమారు 22 మంది మరణించారని.. పలువురు గాయపడ్డారని తెలుస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ సమయంలో రెస్క్యూ టీం అలర్ట్ అయ్యింది.

అవును... గంగానదిలో స్నానమాచరించి ఉత్తరప్రదేశ్‌ లోని కదర్‌ గంజ్‌ కు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి చెరువులో పడింది. దీంతో 22 మంది మరణించగా పలువురు గాయపడ్డారని తెలుస్తుంది. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న ఒక గ్రామానికి చెందిన భక్తులు అంతా కలిసి ఒక ట్రాక్టర్ లో కదర్‌ గంజ్ క్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

దీంతో సమాచారం అందుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్... స్థానిక జిల్లా కలెక్టర్‌ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్... గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఈ ప్రమాదం బాధాకరం అంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన... మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని కలెక్టర్‌ ను ఆదేశించా.. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నా అంటూ ప్రకటించారు.

Tags:    

Similar News