• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  వీగన్స్ బీ కేర్ ఫుల్......

వీగన్స్ బీ కేర్ ఫుల్... ఎముకలు, మెదడు సమస్యలు!

| వీగన్ డైట్ వల్ల హార్ట్ ఎటాక్, డైవర్టికులర్ డిసీజ్ లతో పాటు డయాబెటీస్ వచ్చే ప్రమాదం తక్కువని పలు పరిశోధనలు తేల్చాయని

By - Tupaki Desk
Update: 2024-03-27 02:30 GMT

మాంసాహారంతో పాటు జంతు ఉత్పత్తులనూ తినని వారిని వీగన్స్ అంటారు. ఈ మధ్యకాలంలో "వీగనిజం" ఒక ట్రెండ్ గా మారుతోన్న సంగతి తెలిసిందే. ఇలా మాంసాహారంతో పాటు పాల ఉత్పత్తులను తినని వారి వల్ల పర్యావరణానికి ఎంత ఉపయోగం అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ వీగన్ డైట్ వల్ల మాత్రం అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఇప్పుడు ఈ అంశం ఆసక్తికరంగా మారింది.

అవును... అప్పటివరకూ మాంసాహారిగా మారుతోన్న చాలా మంది తమ ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతోందని నమ్ముతున్నారు! ఇదే సమయంలో వీగన్స్ గా మారితే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చని, ఎక్కువకాలం బ్రతకొచ్చనే అపోహ కూడా ఉందని చెబుతున్నారు. అయితే... వీగన్ గా మారడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారనే అంశానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారమూ లేదని అంటున్నారు! పైగా... ఈ వీగన్ డైట్ వల్ల కొన్ని ప్లస్ లు ఉన్నా.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయని తెలుస్తుంది.

వీగన్ డైట్ వల్ల హార్ట్ ఎటాక్, డైవర్టికులర్ డిసీజ్ లతో పాటు డయాబెటీస్ వచ్చే ప్రమాదం తక్కువని పలు పరిశోధనలు తేల్చాయని చెబుతున్న సమయంలోనే... ఈ వీగన్ ఫుడ్ వల్ల ఎములకు ధృఢంగా ఉండబోవని, ఫలితంగా ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, మాంసాహారులతో పోలిస్తే వీరికి చిన్న దెబ్బ తగిలినా తుంటి, కాలి ఎముకలు విరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు!

వాస్తవానికి వీగన్స్ తమ శరీరంలో పోషక లోపాలను నివారించడంకోసం విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తప్పక స్వీకరించాలట. అయితే... వీగన్స్ తీసుకునే ఆహారం ద్వారా సరైన మోతాదులో విటమిన్ బీ 12, ఐరన్ శరీరానికి తగిన మోతాదులో అందకపోతే అది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో ఇది మెదడు పనితీరుపైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారట!

కాగా... 1944 నవంబర్ నెలలోనే ది వీగన్ సొసైటీని డొనాల్డ్ వాట్సన్ ఏర్పాటు చేశారు. వీగన్, వీగనిజం అనే పదాలు కూడా అప్పుడే! దీంతో... ప్రతీ ఏటా నవంబర్ 1వ తేదీన వరల్డ్ వీగన్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు!

Tags:    
  • Vegans 
  • Brain 
  • Bones 
  • Healthissues 
  • Heartattack 
  • Diabetes 
  • Vegandiet 
  • Politicalnews 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

ప్రపంచంపైకి మరో వైరస్.. అప్రమత్తతే శ్రీరామరక్ష

2026-10-30 05:23 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2026-10-27 11:22 GMT

పరుగుల జీవితంలో మానసిక కల్లోలం!

2026-10-15 13:12 GMT

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా A !

2026-10-13 07:16 GMT

మాన‌వ మెద‌డు ర‌హ‌స్యాల‌ను డీకోడ్ చేసిన సంచ‌ల‌న ప‌రిశోధ‌న‌!

2026-10-10 17:27 GMT

దూరాలు పెరుగుతున్నాయి.. ఒంటరి అవుతున్న మనిషి

2026-10-10 16:58 GMT

రష్యాలో ప్లేగ్ మరణాల కలకలం.. త‌స్స‌దియ్యా అసలు నిజం తెలుసుకోకుండానే!

2026-10-08 07:08 GMT

రష్యాలో మరో మహమ్మారి.. డేంజర్ లో 200 మంది? ప్రపంచానికి భయం

2026-10-05 04:34 GMT

ఈ అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీకు పిల్లలు పుట్టరు..

2026-10-03 12:44 GMT

Copyright @2026

Powered by Blink CMS