షుగర్ పేషెంట్లకు తీపి కబురు... తక్కువ ధరకే వీక్లీ డోస్!
అవును... భారత్ లో డయాబెటిస్, ఊబకాయం బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.;
భారత్ లో ఇటీవల డయాబెటిస్, ఊబకాయం బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. పైగా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మొదలైన కారణాలతో వీటి బారిన పడుతున్న బాధితుల్లో చిన్నారులు, యువత కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి వాడే మందులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది! ఈ క్రమంలో డయాబెటిస్ పేషెంట్లకు ఓ గ్యుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
అవును... భారత్ లో డయాబెటిస్, ఊబకాయం బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటికి వాడే మందులకు డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో పేషెంట్లకు తక్కువ ధరకే యాంటీ డయాబెటిస్ మందులను అందించే పనికి పూనుకుంది నోవో నార్డిస్క్ కంపెనీ! భారతీయ భారీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలకే మెడిసిన్ అందివ్వాలని ప్లాన్ చేస్తోంది.
ఇందులో భాగంగా... డయాబెటిస్ తో పాటు వెయిట్ లాస్ కి వాడే ఒజెంపిక్ మెడిసిన్ వీక్లీ డోస్ ఇప్పుడు రూ.2,200కే లభ్యమవుతుంది! తాజాగా జాతీయ మీడియాతో స్పందించిన నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోటియా దీనికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. తమ ఈ నిర్ణయం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు ఖర్చు భారం తగ్గనుందని చెప్పారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఒజెంపిక్ కి కాంపిటిషన్ డ్రగ్ అయిన ఎలి లిల్లీస్ మౌంజారో వీక్లీ డోస్ ధర రూ.3,200 నుంచి స్టార్ట్ అవుతోందని.. అయితే, నోవో నార్డిస్క్ కి చెందిన మరో వెయిట్ లాస్ డ్రగ్ వెగోవీ రూ.2,700 నుంచి మొదలవుతోందని అన్నారు. అందుకే.. వీక్లీ డోస్ విలువను రూ.2,200గా నిర్ణయించామని.. ఫలితంగా నెలకు రూ.8,800 ఖర్చవుతుందని తెలిపారు.
ఈ క్రమంలో... ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒజెంపిక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిందని.. త్వరలోనే సమీప మెడికల్ షాపుల్లో ఇది అందుబాటులోకి రానుందని చెప్పిన విక్రాంత్.. ఈ డ్రగ్ 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ వేరియంట్లలో లభిస్తోందని అన్నారు. అయితే.. 1 ఎంజీ వేరియంట్ ధర నెలకు రూ.11,175 గా ఉండనుందని తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతంగా వేసుకుంటే సమస్యలు ఎదురుకావొచ్చని తెలిపారు!