• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  బీపీతో బాధపడుతున్నారా .....

బీపీతో బాధపడుతున్నారా .. అయితే !

| మారిన జీవన విధానం, ఆహార అలవాట్లతో ప్రపంచంలో 40 శాతం జనాభా అధికరక్తపోటుతో బాధపడుతున్నది.

By - Tupaki Desk
Update: 2024-06-14 23:30 GMT

మారిన జీవన విధానం, ఆహార అలవాట్లతో ప్రపంచంలో 40 శాతం జనాభా అధికరక్తపోటుతో బాధపడుతున్నది. 2025 నాటికి ఈ సంఖ్య 150 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఒకప్పుడు కేవలం వయోజనులలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారిలో కూడా కనిపిస్తున్నది. ఒక్కసారి రక్తపోటు వచ్చిందంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రక్తపోటు మూలంగా హృదయ సంబంధిత సమస్యలతో పాటు, బ్రెయిన్ హెమరేజ్, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఈ పండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు

కాలంతో సంబంధం లేకుండా లభించే పండు అరటిపండు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడే అరటి పండు రక్తపోటుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తీసుకోవడం వల్ల మంచి నిద్రతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు.

అరటితో పాటు కివీ పండు కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు సాయం చేస్తుంది. కివీలోని యాంటీ-ఆక్సిడెంట్లు, మినరల్స్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటితోపాటు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇక సీజనల్ గా లభించే మామిడి పండు కూడా రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా మామిడి తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో ఉండే బీటా కెరోటిన్, ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు.

Tags:    
  • Bloodpressure 
  • Doctors 
  • Banana 
  • Mango 
  • Kivifruit 
  • Fruits 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

ప్రపంచంపైకి మరో వైరస్.. అప్రమత్తతే శ్రీరామరక్ష

2026-10-30 05:23 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2026-10-27 11:22 GMT

పరుగుల జీవితంలో మానసిక కల్లోలం!

2026-10-15 13:12 GMT

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా A !

2026-10-13 07:16 GMT

మాన‌వ మెద‌డు ర‌హ‌స్యాల‌ను డీకోడ్ చేసిన సంచ‌ల‌న ప‌రిశోధ‌న‌!

2026-10-10 17:27 GMT

దూరాలు పెరుగుతున్నాయి.. ఒంటరి అవుతున్న మనిషి

2026-10-10 16:58 GMT

రష్యాలో ప్లేగ్ మరణాల కలకలం.. త‌స్స‌దియ్యా అసలు నిజం తెలుసుకోకుండానే!

2026-10-08 07:08 GMT

రష్యాలో మరో మహమ్మారి.. డేంజర్ లో 200 మంది? ప్రపంచానికి భయం

2026-10-05 04:34 GMT

ఈ అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీకు పిల్లలు పుట్టరు..

2026-10-03 12:44 GMT

Copyright @2026

Powered by Blink CMS