• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Gossips >  అబ్బే.. ఆ జోడీ ఇంకా...

అబ్బే.. ఆ జోడీ ఇంకా ఫిక్స్ కాలే బాసూ!

| తాజాగా సమాచారం ప్రకారం.. వెంకటేష్, త్రిష కాంబో ఇంకా సెట్టవ్వలేదట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి నిర్మాతలు.. హీరోయిన్ కోసం ఇంకా ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపలేదట.

By - Tupaki Desk
Update: 2024-02-23 09:34 GMT

సీనియర్ హీరోయిన్ త్రిష.. నాలుగు పదుల వయసులో కూడా ఇంకా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గతేడాది పొన్నియన్ సెల్వన్, లియా సినిమాల్లో యాక్ట్ చేసి సూపర్ హిట్స్ అందుకుంది. ఇక చేతి నిండా ప్రాజెక్టులతో 2024లో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తోంది.

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీలో నటిస్తోంది త్రిష. దాంతోపాటు మలయాళంలో మరో సినిమా కూడా చేస్తోంది. కోలీవుడ్ లో అజిత్, కమల్ హాసన్ మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరితో నటించనుంది త్రిష. ఇక టాలీవుడ్ ను అప్పట్లో ఒక ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అతడు వంటి పలు సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఆ తర్వాత వరుస ఛాన్సులు దక్కించుకుని సీనియర్ హీరోలందరి సరసన ఆడిపాడింది. ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవితో నటిస్తోంది. విశ్వంభర మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అయితే త్రిష.. వెంకటేష్ నెక్స్ట్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇటీవల వార్తలు వచ్చాయి. వెంకీ మామ- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కు ఆమె సైన్ చేసినట్లు టాక్ వినిపించింది.

తాజాగా సమాచారం ప్రకారం.. వెంకటేష్, త్రిష కాంబో ఇంకా సెట్టవ్వలేదట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి నిర్మాతలు.. హీరోయిన్ కోసం ఇంకా ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపలేదట. ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కాగా, వీరిద్దరు కలిసి గతంలో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నమో వెంకటేశా, బాడీ గార్డ్ సినిమాలు చేశారు.

వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పొంగల్ ను టార్గెట్ గా పెట్టుకుని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందట. మరి ఈ సినిమాతో వెంకీ మామ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.

Tags:    
  • Venkatesh 
  • Trishakrishnan 
  • Tollywood 
  • Anilravipudi 
  • Bodyguard 
  • Movieshooting 
  • Victoryvenkatesh 

Similar News

డూప్‌కి రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్‌.. హీరో ఏం చేస్తాడు?

2026-10-08 06:55 GMT

అభిమానులు కూడా ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తున్నారా?

2026-07-08 03:30 GMT

స్టార్ హీరోకి తేడా కొట్టింది.. రిలీజ్ ముంగిట రీ షూట్

2025-12-17 03:56 GMT

అతి ఆలోచ‌న చేతులు కాల్చుకునేలా!

2025-09-21 21:30 GMT

సుకుమార్- షారుక్.. ఇప్పుడు జరిగే పనేనా?

2025-06-11 22:30 GMT

ఆఫీస్ కోసం 25ల‌క్ష‌ల అద్దె చెల్లిస్తున్న సూప‌ర్‌స్టార్

2025-02-20 13:16 GMT

ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా లేనట్లే!

2024-10-26 03:15 GMT

అఖండ 2 కోసం ఆమెను దించుతున్నారా.. ప్లాన్ అదుర్స్..!

2024-08-12 06:16 GMT

అమ‌రావ‌తిలో క‌ల్కి ఈవెంట్‌పై ఈ ప్ర‌చారం నిజ‌మా?

2024-06-18 04:12 GMT

అంజ‌లిపై ఇంట్లో వాళ్ల‌కు అంత న‌మ్మ‌క‌మా!

2024-05-27 06:30 GMT

విడాకుల వార్త‌ల‌కు చెక్ పెట్టిన హార్థిక్ సోద‌రుడు!

2024-05-26 04:01 GMT

పెళ్లి భాజాల కోస‌మేనే ఈ రెస్టారెంట్ మీటింగ్!?

2024-04-18 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS