• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Gossips >  ప్రభాస్‌, అనుష్క జోడీ.....

ప్రభాస్‌, అనుష్క జోడీ.. ఇంట్రెస్టింగ్ రూమర్‌

| అనుష్క ఎలాగూ సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతుంది. కనుక అది ప్రభాస్ సినిమా తో అయితే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు అనేది కొందరి అభిప్రాయం.

By - Tupaki Desk
Update: 2023-07-29 12:28 GMT

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. స్టార్‌ హీరోయిన్‌ అనుష్క జోడీని ఇష్టపడని వారు ఉండరు. ఇద్దరు కలిసి బాహుబలి సినిమాలో మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారు అనడంలో సందేహం లేదు. అంతకు ముందు మిర్చి సినిమా లో కూడా వీరిద్దరి జోడీగా నటిస్తూ స్క్రీన్‌ పై ఉంటే అలాగే చూస్తూ ఉండిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి జోడీ గురించి ప్రస్తుతం ఆసక్తికర పుకారు ఒకటి షికారు చేస్తోంది.

ఈ పుకారు నిజం అయితే బాగుండు అనేది చాలా మంది బలంగా కోరుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే ప్రభాస్, అనుష్క జంటగా నటించాలని ఇప్పటికి కూడా చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. కానీ అనుష్క కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటుంది. అనుష్క మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా తర్వాత అనుష్క సినిమాలు చేస్తుందా లేదా అనే విషయమై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యం లో ప్రభాస్ సినిమా లో అనుష్క ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అనుష్క ఎలాగూ సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతుంది. కనుక అది ప్రభాస్ సినిమా తో అయితే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు అనేది కొందరి అభిప్రాయం.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఇప్పటికే హీరోయిన్స్ కన్ఫర్మ్‌ అయ్యారు. హీరోయిన్ గా కాకుండా ఒక ముఖ్య పాత్రలో అనుష్కను చూపించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కోరడంతో మారుతి ఆ పనుల్లో ఉన్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుప్పుమంటోంది.

ఇక వీరిద్దరి కాంబోలో సినిమా లేదా సన్నివేశాలు వస్తూ ఉంటే అభిమానులు కచ్చితంగా ఎగిరి గంతేయడం ఖాయం. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మీడియా సర్కిల్స్ వారు అంతా కూడా ఈ కాంబో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • Prabhas 
  • Anushkashetty 
  • Baahubaliseries 
  • Msshettymrshetty 
  • Maruti 

Similar News

డూప్‌కి రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్‌.. హీరో ఏం చేస్తాడు?

2026-10-08 06:55 GMT

అభిమానులు కూడా ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తున్నారా?

2026-07-08 03:30 GMT

స్టార్ హీరోకి తేడా కొట్టింది.. రిలీజ్ ముంగిట రీ షూట్

2025-12-17 03:56 GMT

అతి ఆలోచ‌న చేతులు కాల్చుకునేలా!

2025-09-21 21:30 GMT

సుకుమార్- షారుక్.. ఇప్పుడు జరిగే పనేనా?

2025-06-11 22:30 GMT

ఆఫీస్ కోసం 25ల‌క్ష‌ల అద్దె చెల్లిస్తున్న సూప‌ర్‌స్టార్

2025-02-20 13:16 GMT

ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా లేనట్లే!

2024-10-26 03:15 GMT

అఖండ 2 కోసం ఆమెను దించుతున్నారా.. ప్లాన్ అదుర్స్..!

2024-08-12 06:16 GMT

అమ‌రావ‌తిలో క‌ల్కి ఈవెంట్‌పై ఈ ప్ర‌చారం నిజ‌మా?

2024-06-18 04:12 GMT

అంజ‌లిపై ఇంట్లో వాళ్ల‌కు అంత న‌మ్మ‌క‌మా!

2024-05-27 06:30 GMT

విడాకుల వార్త‌ల‌కు చెక్ పెట్టిన హార్థిక్ సోద‌రుడు!

2024-05-26 04:01 GMT

పెళ్లి భాజాల కోస‌మేనే ఈ రెస్టారెంట్ మీటింగ్!?

2024-04-18 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS