• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Gossips >  పవన్ స్క్రీన్ పై బిగ్...

పవన్ స్క్రీన్ పై బిగ్ డౌట్..!

| సినిమా మొదలైన 10 నిమిషాల నుంచి చివరి వరకు పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని తేజ్ చెప్పారు.

By - Tupaki Desk
Update: 2023-07-20 06:01 GMT

పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ఇద్దరు కలిసి చేస్తున్న బ్రో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. పవన్ సినిమా కు బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అయితే ఈ బిజినెస్ క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశం బ్రో మేకర్స్ కి లేదని తెలుస్తుంది.

అందుకే బ్రో సినిమాకు ఎలాంటి టికెట్ ప్రైజ్ హైక్ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక బ్రో సినిమాకు ముందు నుంచి ఏదో ఒక రూపం లో కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైం లో అది మరింత ఎక్కువైంది.

బ్రో సినిమాలో పవన్ ఎంతసేపు కనిపిస్తాడు అన్నది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న అయ్యింది. ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపిస్తున్నాడని తెలిసిందే. అయితే గోపాల గోపాల సినిమాలో తరహా సీరియస్ పాత్ర లా కాకుండా ఈ సినిమాలో ఎంతో జోవియల్ గా ఉంటాడని తెలుస్తుంది.

అంతేకాదు సినిమాలో పవన్ చేసిన పాత్ర కేవలం గెస్ట్ రోల్ లా ఉంటుందని కామెంట్స్ వస్తుండగా దానికి ఇంటర్వ్యూస్ లో తేజ్ పవన్ పాత్ర గురించి భారీ ఎలివేషన్స్ ఇస్తున్నాడు. సినిమా మొదలైన 10 నిమిషాల నుంచి చివరి వరకు పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని తేజ్ చెప్పారు.

సినిమా మొత్తం రన్ టైం లో ఆయన 50 నిమిషాల దాకా ఉంటారని చెప్పారు. తేజ్ అలా చెప్పడం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. సినిమాలో పవన్ కి ఒక సోలో సాంగ్.. తేజ్ కి ఒక సోలో సాంగ్.. మరో రెండు మాంటేజ్ సాంగ్.. తేజ్ పవన్ ల మధ్య మరో సాంగ్ ఉంటాయని తెలుస్తుంది. మెగా పవర్ ఫ్యాన్స్ అందరికీ బ్రో మంచి ఫీస్ట్ అందించేలా సినిమా ఉంటుందని అంటున్నారు.

బ్రో సినిమాను పవన్ కేవలం 3 వారాల షూటింగ్ చేసి క్లోజ్ చేశారు. అందుకే ఈ సినిమాలో పవన్ పాత్రపై కొన్ని అనుమానాలు వచ్చాయి. కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ ఫ్యాన్స్ కి మజా ఇస్తుందని తప్పకుండా పవర్ స్టార్ రేంజ్ కి తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. బ్రో తో మొదలై భోళా శంకర్, ఆదికేశవ, గాంఢీవదారి అర్జున ఇలా రెండు మూడు నెలల్లోనే మెగా ఫ్యాన్స్ కి వరుస సినిమాలు ఎంటర్టైన్ చేయనున్నాయి.

Tags:    
  • PawanKalyan 
  • SaiDharamTej 
  • BroMovie 
  • Samuthrakhani 
  • SSThaman 
  • KetikaSharma 
  • Priyavarrior 

Similar News

డూప్‌కి రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్‌.. హీరో ఏం చేస్తాడు?

2026-10-08 06:55 GMT

అభిమానులు కూడా ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తున్నారా?

2026-07-08 03:30 GMT

స్టార్ హీరోకి తేడా కొట్టింది.. రిలీజ్ ముంగిట రీ షూట్

2025-12-17 03:56 GMT

అతి ఆలోచ‌న చేతులు కాల్చుకునేలా!

2025-09-21 21:30 GMT

సుకుమార్- షారుక్.. ఇప్పుడు జరిగే పనేనా?

2025-06-11 22:30 GMT

ఆఫీస్ కోసం 25ల‌క్ష‌ల అద్దె చెల్లిస్తున్న సూప‌ర్‌స్టార్

2025-02-20 13:16 GMT

ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా లేనట్లే!

2024-10-26 03:15 GMT

అఖండ 2 కోసం ఆమెను దించుతున్నారా.. ప్లాన్ అదుర్స్..!

2024-08-12 06:16 GMT

అమ‌రావ‌తిలో క‌ల్కి ఈవెంట్‌పై ఈ ప్ర‌చారం నిజ‌మా?

2024-06-18 04:12 GMT

అంజ‌లిపై ఇంట్లో వాళ్ల‌కు అంత న‌మ్మ‌క‌మా!

2024-05-27 06:30 GMT

విడాకుల వార్త‌ల‌కు చెక్ పెట్టిన హార్థిక్ సోద‌రుడు!

2024-05-26 04:01 GMT

పెళ్లి భాజాల కోస‌మేనే ఈ రెస్టారెంట్ మీటింగ్!?

2024-04-18 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS