• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Gossips >  నాని గేమ్‌ ప్లాన్...

నాని గేమ్‌ ప్లాన్ ఛేంజ్‌.. మరో 'దసరా' కి రెడీ

| హాయ్ నాన్న తర్వాత నాని చేయబోతున్న సినిమా

By - Tupaki Desk
Update: 2023-07-20 04:02 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'దసరా' పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని.. ఓ కాంతార.. ఓ కేజీఎఫ్‌ మాదిరిగా ఏడాది అంతా కూడా గుర్తుంచుకునే విధంగా దసరా ఉంటుందని యూనిట్ సభ్యులు చాలా ప్రచారం చేశారు. కానీ చివరకు నిరాశే మిగిలింది.

దసరా ఫలితంపై పెద్దగా పట్టింపు లేకుండా నాని వెంటనే తన తదుపరి సినిమా ను శౌర్యువ్‌ దర్శకత్వంలో మొదలు పెట్టాడు. మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు ఇటీవలే 'హాయ్‌ నాన్న' అనే టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేశాడు. దసరా సినిమా తో పోల్చితే హాయ్‌ నాన్న సినిమాలో నాని పాత్ర చాలా సాఫ్ట్ గా ఉండబోతున్నట్లు తాజాగా విడుదలైన టీజర్ ను చూస్తే అర్థం అవుతుంది.

హాయ్ నాన్న తర్వాత నాని చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్‌ చేశారు. స్క్రిప్ట్‌ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయిందని.. హాయ్‌ నాన్న విడుదలకు ముందే ఈ సినిమా ప్రారంభం అవ్వబోతుంది అనుకుంటూ ఉండగా నాని ప్లాన్‌ ఛేంజ్ చేసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

హాయ్‌ నాన్న సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కాకుండా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబోలో వచ్చిన దసరా సినిమా కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోకున్నా కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతే కాకుండా శ్రీకాంత్‌ ఓదెలపై నానికి చాలా నమ్మకంను కలిగించింది.

అందుకే మరోసారి శ్రీకాంత్ ఓదెలతో కలిసి తెలంగాణ నేపథ్యంలోని కథతో నాని సినిమాను చేసేందుకు సిద్ధం అయ్యాడు. హాయ్ నాన్న సినిమా లో నాని చాలా సాఫ్ట్ గా కనిపించబోతున్నాడు.. ఆ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల తో చేయబోతున్న సినిమా లో మళ్లీ దసరా సినిమాలో మాదిరిగా చాలా రఫ్‌ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

నాని శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్ధం అయిన నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ తన హిట్ మూవీ బ్రోచేవారెవరురా సినిమాకు సీక్వెల్‌ ను రూపొందించే పనిలో పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    
  • Nani 
  • SrikanthOdela 
  • Dasara 
  • VivekAtreya 
  • NaturalStar 
  • HiNanna 

Similar News

డూప్‌కి రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్‌.. హీరో ఏం చేస్తాడు?

2026-10-08 06:55 GMT

అభిమానులు కూడా ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తున్నారా?

2026-07-08 03:30 GMT

స్టార్ హీరోకి తేడా కొట్టింది.. రిలీజ్ ముంగిట రీ షూట్

2025-12-17 03:56 GMT

అతి ఆలోచ‌న చేతులు కాల్చుకునేలా!

2025-09-21 21:30 GMT

సుకుమార్- షారుక్.. ఇప్పుడు జరిగే పనేనా?

2025-06-11 22:30 GMT

ఆఫీస్ కోసం 25ల‌క్ష‌ల అద్దె చెల్లిస్తున్న సూప‌ర్‌స్టార్

2025-02-20 13:16 GMT

ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా లేనట్లే!

2024-10-26 03:15 GMT

అఖండ 2 కోసం ఆమెను దించుతున్నారా.. ప్లాన్ అదుర్స్..!

2024-08-12 06:16 GMT

అమ‌రావ‌తిలో క‌ల్కి ఈవెంట్‌పై ఈ ప్ర‌చారం నిజ‌మా?

2024-06-18 04:12 GMT

అంజ‌లిపై ఇంట్లో వాళ్ల‌కు అంత న‌మ్మ‌క‌మా!

2024-05-27 06:30 GMT

విడాకుల వార్త‌ల‌కు చెక్ పెట్టిన హార్థిక్ సోద‌రుడు!

2024-05-26 04:01 GMT

పెళ్లి భాజాల కోస‌మేనే ఈ రెస్టారెంట్ మీటింగ్!?

2024-04-18 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS