• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Gossips >  పుష్ప-2లో సమంత.. ఏంటి...

పుష్ప-2లో సమంత.. ఏంటి మ్యాటర్?

| ఇప్పుడు పుష్ప-2లో గెస్ట్ రోల్ చేస్తుందని, పుష్ప-3లో కూడా ఆమె పాత్రకు మంచి స్కోప్ ఉండనుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-03-26 12:55 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. ఇటీవల సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చి మళ్లీ రీ ఎంట్రీకి రెడీ అయిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన సామ్.. ఇటీవల ఇండియాకు తిరిగొచ్చింది. త్వరలోనే సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో సందడి చేయనుంది. ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేసిన సమంత.. తన వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తోంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కోసం సమంత మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించిన సామ్.. సిటాడెల్ కోసం చాలా కష్టపడినట్లు ఇటీవల పాడ్ కాస్ట్ లో తెలిపింది. ఒకసారి సిటాడెల్ సెట్స్ లో కళ్లు తిరిగిపడిపోయినట్లు కూడా చెప్పింది. ఆ సమయంలో అంతా అప్సెట్ అయ్యారని పేర్కొంది. కాసేపటికి స్పృహలోకి వచ్చానని తెలిపింది.

అయితే గత కొద్ది రోజులుగా సమంత.. పుష్ప-2లో క్యామియో రోల్ లో నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో ఐటెం సాంగ్ చేసిన సమంత.. అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు పుష్ప-2లో గెస్ట్ రోల్ చేస్తుందని, పుష్ప-3లో కూడా ఆమె పాత్రకు మంచి స్కోప్ ఉండనుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు పుష్ప-2లో సమంత గెస్ట్ రోల్ చేస్తుందా లేక మళ్లీ ఐటెం సాంగ్ చేస్తుందన్న విషయంపై నెట్టింట చర్చ నడుస్తోంది.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగాలంటే మాత్రం.. పుష్ప-2లో ఐటెం సాంగ్ కు ఓకే చెప్పకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఓకే చెబితే ఆమె మంచి ఆఫర్లు కోల్పోతుందని అంటున్నారు. కానీ ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటే.. ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనిపిస్తోందని చెబుతున్నారు. ఐటెం సాంగ్ తో సంబంధం లేదని మిగతా ఎలాంటి రోల్ అయినా పర్వాలేదని అంటున్నారు.

సుకుమార్.. ఇటీవల పుష్ప-2 కోసం సమంతతో చర్చించినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ సమంత ఇంకా ఓకే చెప్పిందో లేదో తెలియదని మాట్లాడుకుంటున్నారు. ఇక సమంత చేసిన ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్ ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తుంటుంది. ఆ సాంగ్ కు అంత క్రేజ్ సమంత వల్లే వచ్చింది. అయితే పుష్ప 2లో సమంత రోల్ పై అధికారికంగా ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

Tags:    
  • Samantharuthprabhu 
  • Alluarjun 
  • Panindianmovie 
  • Staractress 
  • Guestrole 
  • Pushpatherule 
  • Sukmar 
  • Itemsong 

Similar News

డూప్‌కి రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్‌.. హీరో ఏం చేస్తాడు?

2026-10-08 06:55 GMT

అభిమానులు కూడా ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తున్నారా?

2026-07-08 03:30 GMT

స్టార్ హీరోకి తేడా కొట్టింది.. రిలీజ్ ముంగిట రీ షూట్

2025-12-17 03:56 GMT

అతి ఆలోచ‌న చేతులు కాల్చుకునేలా!

2025-09-21 21:30 GMT

సుకుమార్- షారుక్.. ఇప్పుడు జరిగే పనేనా?

2025-06-11 22:30 GMT

ఆఫీస్ కోసం 25ల‌క్ష‌ల అద్దె చెల్లిస్తున్న సూప‌ర్‌స్టార్

2025-02-20 13:16 GMT

ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా లేనట్లే!

2024-10-26 03:15 GMT

అఖండ 2 కోసం ఆమెను దించుతున్నారా.. ప్లాన్ అదుర్స్..!

2024-08-12 06:16 GMT

అమ‌రావ‌తిలో క‌ల్కి ఈవెంట్‌పై ఈ ప్ర‌చారం నిజ‌మా?

2024-06-18 04:12 GMT

అంజ‌లిపై ఇంట్లో వాళ్ల‌కు అంత న‌మ్మ‌క‌మా!

2024-05-27 06:30 GMT

విడాకుల వార్త‌ల‌కు చెక్ పెట్టిన హార్థిక్ సోద‌రుడు!

2024-05-26 04:01 GMT

పెళ్లి భాజాల కోస‌మేనే ఈ రెస్టారెంట్ మీటింగ్!?

2024-04-18 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS