పాన్ ఇండియా లిస్ట్ భారీగానే!

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే? అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2025-10-21 15:30 GMT

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే? అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియా సినిమా అంటే టాలీవుడ్ నుంచి అగ్ర హీరో చిత్ర‌మే రావాల్సిన ప‌నిలేదు. అందులో న‌టించింది యంగ్ హీరో అయినా కంటెంట్ ఉందంటే? క‌టౌట్ తో ప‌నిలేకుండా ఇండియా వైడ్ ప్రేక్ష‌కులు తెలుగు చిత్రాల‌ను ఆద‌రిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్, తేజ స‌జ్జా లాంటి వారు పాన్ ఇండియాకి అలా క‌నెక్ట్ అయిన స్టార్లే. వాళ్ల‌ను చూసి మ‌రింత మంది యంగ్ హీరోలు రేసులో మేము ఉన్నామంటూ ముందు కొస్తున్నారు.

రెట్టించిన ఉత్సాహంతో మ‌రో యంగ్ స్టార్:

ఇప్ప‌టికే యంగ్ హీరో సుధీర్ బాబు `హ‌రోం హ‌ర‌`తో ఓ పాన్ ఇండియా అటెంప్ట్ చేసాడు. కానీ ఫ‌లితాలు ఆశించిన విధంగా రాలేదు. అయినా యంగ్ హీరో ఎ క్క‌డా త‌గ్గ‌లేదు. అది కాక‌పోతే మ‌రోటి అంటూ ముందుకొస్తున్నాడు. `జ‌ఠాధ‌ర‌`తో మెప్పించ‌డానికి రెడీ అవుత‌న్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఆ సినిమాతో సంబంధం లేకుండా త‌దుప‌రి రిలీజ్ లు కూడా అదే లా ఉండేలా చూసుకుంటున్నాడు. పాన్ ఇండియా కి క‌నెక్ట్ అయ్యే క‌థ‌లే ఎంచుకుంటున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసిందే. మ‌రో యంగ్ హీరో నిఖిల్ ఇప్ప‌టికే `కార్తికేయ‌2` తో పాన్ ఇండియాలో ప‌రిచ‌య‌మ‌య్యాడు.

మెగా హీరో ప్లానింగ్ :

తొలి సినిమాతో గ్రాండ్ విక్ట‌రీ అందుకున్నాడు. మ‌ధ్య‌లో ఓ ప్ర‌య‌త్నం బెడిసి కొట్టినా నిరుత్సాహ ప‌డ‌లేదు. ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తున్నాడు. `స్వ‌యంభూ`, ` ది ఇండియా హౌస్` చిత్రాలు పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. మెగా హీరో వ‌రుణ్ తేజ్ తొలి పాన్ ఇండియా అటెంప్ట్ `మ‌ట్కా` బెడిసి కొట్టినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. మేర్ల‌పాక గాంధీతో చేస్తోన్న సినిమా మిన‌హ‌యిస్తే తదుప‌రి రిలీజ్ అయ్యే చిత్రాల కాన్సెప్ట్ ల‌న్నీ పాన్ ఇండియా క‌థ‌ల‌గానే తెర‌పైకి వ‌స్తున్నాయి.

తేజ స‌జ్జా, అడ‌వి శేషు స‌క్సెస్ ట్రాక్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తేజ వ‌రుస పాన్ ఇండియా విజ‌యాల‌తో పుల్ స్వింగ్ లో ఉన్నాడు.

టైర్ 2 హీరోల త‌ర్వాత వీళ్లే:

`హ‌నుమాన్` త‌ర్వాత ఇటీవ‌ల రిలీజ్ అయిన `మిరాయ్` తో మ‌రో భారీ హిట్ అందుకున్నాడు. త‌దుప‌రి రిలీజ్ లు కూడా పాన్ ఇండియాలోనే. అడ‌వి శేషు సినిమా రిలీజ్ లు ఆల‌స్య‌మైనా కంటెంట్ ఉన్న బొమ్మ‌తోనే వ‌స్తాడు? అన్న‌ది ప్రేక్ష‌కుల్లో బ‌ల‌మైన న‌మ్మ‌కం. త‌దుప‌రి `డెకాయిట్`, `గూఢ‌ఛారి 2` చిత్రాలు భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న‌వే. నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న లైన‌ప్ చిత్రాల‌ గురించి చెప్పాల్సిన‌ ప‌నిలేదు. టైర్ 2 హీరోల‌గా పాన్ ఇండియా మార్కెట్ లో చ‌లామ‌ణీలో ఉన్నారు. వ‌చ్చే ఏడాదిన్న‌ర కాలంలో ఈ యంగ్ హీరోల నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Tags:    

Similar News