ఎల్లమ్మకు ఎన్నాళ్లీ కష్టాలు..?
బలగం సినిమాతో కమెడియన్ వేణు కాస్త డైరెక్టర్ వేణుగా మారాడు. ఆ సినిమాతో మంచి ఎమోషనల్ రైడ్ ని చూపించి ఆడియన్స్ కి ఒక మంచి ట్రీట్ ఇచ్చాడు వేణు.;
బలగం సినిమాతో కమెడియన్ వేణు కాస్త డైరెక్టర్ వేణుగా మారాడు. ఆ సినిమాతో మంచి ఎమోషనల్ రైడ్ ని చూపించి ఆడియన్స్ కి ఒక మంచి ట్రీట్ ఇచ్చాడు వేణు. ఐతే బలగం హిట్ పడటంతో వేణుకి మరో సినిమా ఛాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. ఈసారి బడ్జెట్ విషయంలో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆయన కథకు తగిన బడ్జెట్ కేటాయించాలని అనుకుంటున్నారు. దిల్ రాజు, వేణు కాంబోలో ఎల్లమ్మ సినిమా కథ లాక్ చేశారు. గ్రామదేవత ఎల్లమ్మ కథా నేపథ్యంతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా ఇది రాబోతుంది.
ఎల్లమ్మ అతనితో చేస్తే రిస్క్..
ఎల్లమ్మ సినిమాలో నితిన్ ని హీరోగా అనుకున్నారు. దిల్ రాజు నితిన్ తో తమ్ముడు సినిమా తీసి తీవ్రంగా నష్టపోయారు. అందుకే ఎల్లమ్మ అతనితో చేస్తే రిస్క్ అని ఫీల్ అవుతున్నాడు. అందుకే నితిన్ ప్లేస్ లో వేరొకరిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడట. నితిన్ కాకపోతే శర్వానంద్ అందులో ఫిట్ అని అంటున్నారు. ఐతే శర్వానంద్ కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. అందుకే తమిళ హిరోని తీసుకోవాలనే చర్చలు జరుగుతున్నాయట.
ఒక మంచి కథ.. అందులో హిట్ కొట్టిన డైరెక్టర్ చేస్తున్న అటెంప్ట్ కి హీరో కోసం వేట కొనసాగుతూనే ఉంది. అసలైతే వేణు వేసుకున్న లెక్కల ప్రకారం అయితే జూలై, ఆగష్టులో ఎల్లమ్మ సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ హీరో విషయంలో ఇంకా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ రెడీగా ఉన్నారు. కానీ దానికి కావాల్సిన కథనాయకుడు మాత్రం దొరకట్లేదు.
హీరోయిన్ రోల్ కి ఎక్కువ ప్రాధాన్యత..
ఎల్లమ్మ సినిమాలో అసలైతే నానిని హీరోగా తీసుకోవాలని అనుకున్నారట. కానీ అందులో హీరో పాత్ర కన్నా హీరోయిన్ రోల్ కి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల నాని ఆ సినిమాకు ఓకే చెప్పలేదట. నితిన్, శర్వానంద్, తమిళ్ హీరో ఇలా హీరోల పేర్లు మారుస్తున్నారు కానీ అఫీషియల్ గా ఎల్లమ్మ ఎప్పుడు మొదలు పెడతారన్నది చెప్పట్లేదు. ఇక హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకుంటారని తెలుస్తుంది.
ఎల్లమ్మలో కీర్తి సురేష్ మాత్రమే అనుకుంటే ఇప్పుడు సాయి పల్లవిని కూడా తీసుకొచ్చే ప్లానింగ్ నడుస్తుందట. ముందు ఈ సినిమాలో సాయి పల్లవినే తీసుకోవాలని వేణు అనుకున్నాడట. కానీ సాయి పల్లవి బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆమె దొరక్కపోతే కీర్తి సురేష్ ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు సినిమా లేట్ అయ్యింది కాబట్టి సాయి పల్లవి కోసమే గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.