KGF యష్.. ప్రభాస్ లా చేసుంటే ఈ కష్టాలు తప్పేవేమో?

'KGF చాప్టర్ 2'.. 1200 కోట్లు.. యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా రాకింగ్ స్టార్ అయిపోయాడు.;

Update: 2025-10-29 07:10 GMT

'KGF చాప్టర్ 2'.. 1200 కోట్లు.. యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా రాకింగ్ స్టార్ అయిపోయాడు. ఆ హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి, నెక్స్ట్ బిగ్ హీరో.. అని అందరూ ఫిక్స్ అయ్యారు. సరైన కథలు పడితే, ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ మార్కెట్‌ను క్రియేట్ చేయగల సత్తా యష్‌కు ఉందని ట్రేడ్ పండితులు కూడా నమ్మారు. కానీ అలా జరగడం లేదు.

బాహుబలి తర్వాత ప్రభాస్ ట్రాక్ ను గమనిస్తే.. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్.. వరుసగా భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచాయి. కానీ, ప్రభాస్ ఎక్కడా ఆగలేదు. ఫ్లాపులు పడుతున్నా, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా డిఫరెంట్ జానర్లు ట్రై చేస్తూనే ఉన్నాడు. 'సలార్'తో యాక్షన్‌లోకి వచ్చాడు, 'కల్కి'తో సైన్స్ ఫిక్షన్‌లోకి వెళ్లాడు, 'రాజా సాబ్'తో హారర్ కామెడీ చేస్తున్నాడు, 'స్పిరిట్'తో సందీప్ వంగా లాంటి డైరెక్టర్‌తో జత కట్టాడు.

హిట్టా ఫట్టా పక్కన పెడితే, ప్రభాస్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? అనే క్యూరియాసిటీని మాత్రం ఆయన కాన్‌స్టంట్‌గా మెయిన్‌టైన్ చేశాడు. కానీ, యష్ విషయంలో సీన్ రివర్స్‌లో ఉంది. 'KGF 2' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత, యష్ చాలా పెద్ద గ్యాప్ తీసుకున్నాడు. తన నెక్స్ట్ సినిమా 'టాక్సిక్' అనౌన్స్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. ఆ సినిమా షూటింగ్ కూడా చాలా సైలెంట్‌గా, సీక్రెట్‌గా జరుగుతోంది.

డైరెక్టర్‌తో విభేదాలు, రీషూట్లు, బడ్జెట్ 600 కోట్లకు పెరిగిపోవడం లాంటి నెగెటివ్ రూమర్స్ వినిపిస్తున్నా, టీమ్ నుంచి సరైన క్లారిటీ లేదు. ఈ లాంగ్ గ్యాప్, ఈ సీక్రెసీ.. యష్ కెరీర్‌కు ప్లస్సా మైనస్సా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రభాస్‌లా, 'KGF 2' తర్వాత యష్ కూడా వెంటనే రెండు మూడు డిఫరెంట్ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టి ఉంటే, ఈపాటికి మరో సినిమా రిలీజై ఉండేది. అది యావరేజ్ అయినా, ఫ్లాప్ అయినా.. యష్ మార్కెట్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. అప్పుడు 'టాక్సిక్' మీద ఇంత ప్రెషర్ ఉండేది కాదు.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 'KGF 2' తర్వాత వస్తున్న సినిమా కావడంతో, 'టాక్సిక్' మీద అంచనాలు హై లెవల్‌లో ఉన్నాయి. దానికి తోడు ఈ రూమర్స్, డిలే టాక్ ఫ్యాన్స్‌ను కంగారు పెడుతున్నాయి. ఈ ఒక్క సినిమా తేడా కొడితే, 'KGF 2' తెచ్చిన క్రేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ప్రభాస్ తీసుకున్న కీప్ మూవింగ్ స్ట్రాటజీనే బెటరేమో అనిపిస్తోంది.

Tags:    

Similar News