చెర్రీ, నాని.. బిగ్ అడ్వాంటేజ్

అందులో అడివి శేష్ డెకాయిట్, రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ సినిమాలకు ఇది అడ్వాంటేజ్ కానుంది.;

Update: 2025-10-28 13:30 GMT

కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన కన్నడ స్టార్ హీరో యశ్ ఆ తర్వాత సినిమాకు మాత్రం చాలా టైమ్ తీసుకుంటున్నారు. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ టాక్సిక్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రారభంమై కూడా చాలా రోజులైంది. వచ్చే ఏడాది ఉగాదికి థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ కూడా ఎప్పుడో ప్రకటించారు.

అయితే హై బడ్జెట్ తో తెరకెక్కిస్తుండం, కేజీఎఫ్ తర్వాత యశ్ నుంచి రానున్న సినిమా కావడంతో.. బాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తన సినిమా లవ్ అండ్ వార్ ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. యశ్ సినిమాతో బాక్సాఫీల్ క్లాష్ అక్కర్లేదని భావించిన లవ్ అండ్ వార్ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఈ సినిమాకు రూట్ క్లియరైంది.

కానీ, ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాదికి రావడం కష్టమే అని తెలుస్తోంది. రిలీజ్ వాయిదా వేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే.. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించి పలు పోర్షన్స్ పట్ల యశ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. యశ్ కు ఆల్ ఓవర్ ఇండియాలో మాస్ ఇమేజ్ ఉంది. అయితే దర్శకురాలు గీతూ అలా కాకుండా ఆమెకు టచ్ ఉన్న సెన్సిబుల్ జానర్ లో ఫిల్మ్ మేకింగ్ చేశారట.

అందుకే యశ్ తన పాన్ ఇండియా మార్కెట్, స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని పలు సన్నివేశాలు మళ్లీ రీ షూట్ చేయాలని చెప్పారట. ఇందులో మరిన్ని యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలని కోరారట. దీని కోసం స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేయాలని డైరెక్టర్ ను కోరినట్లు సమాచారం. అందుకే టాక్సిక్ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది.

ఫైనల్ గా 2026 ఉగాది బరిలో నుండి ఈ సినిమా తప్పుకోవడంతో టాలీవుడ్ లో పలు సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ కలిసివస్తుంది. అందులో అడివి శేష్ డెకాయిట్, రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ సినిమాలకు ఇది అడ్వాంటేజ్ కానుంది. యశ్ సినిమా తప్పుకుంటే కన్నడ మార్కెట్ ఈ సినిమాలకు కచ్చితంగా యూజ్ అవుతుంది.

Tags:    

Similar News