టాక్సిక్ వేటకు ఇంకా వంద రోజులే..
లేటెస్ట్ పోస్టర్ లో యష్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. షర్ట్ లేకుండా వెనుక వైపు తిరిగి ఉన్న యష్, కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు.;
'కేజీఎఫ్ 2' తర్వాత రాకింగ్ స్టార్ యష్ నుంచి సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ఈమధ్య కాలంలోఆయన నెక్స్ట్ సినిమా వాయిదా అన్నట్లు చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. ఇక ఇన్నాళ్లు మౌనంగా ఉన్న యష్, ఇప్పుడు బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్' విడుదలకు సమయం ఆసన్నమైంది. సరిగ్గా ఇంకా వంద రోజులే మిగిలి ఉందని గుర్తుచేస్తూ చిత్ర బృందం ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసింది.
గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది, అంటే 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, విడుదల తేదీకి వంద రోజుల కౌంట్ డౌన్ మొదలైందనే సంకేతాన్ని ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో యష్ అభిమానుల సందడి అప్పుడే మొదలైపోయింది. మార్చి నెలలో థియేటర్ల వద్ద జాతర ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు.
లేటెస్ట్ పోస్టర్ లో యష్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. షర్ట్ లేకుండా వెనుక వైపు తిరిగి ఉన్న యష్, కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. వీపు మీద ఒక విచిత్రమైన టాటూ హైలైట్ గా నిలిచింది. ఈ లుక్ సినిమా ఎంత వైల్డ్ గా, వయొలెంట్ గా ఉండబోతోందో హింట్ ఇస్తోంది.
ఈ సినిమాకు "పెద్దల కోసం ఒక అద్భుత కథ" అనే ట్యాగ్ లైన్ పెట్టడం ఆసక్తిని రేపుతోంది. సాధారణంగా యష్ అంటే మాస్ సినిమాలు అనుకుంటారు, కానీ గీతు మోహన్ దాస్ లాంటి క్లాస్ డైరెక్టర్ తో ఇలాంటి టైటిల్ అంటే కచ్చితంగా ఏదో కొత్త ప్రయోగం జరుగుతోందని అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో ఊహించని మలుపులు, బలమైన భావోద్వేగాలు ఉండేలా ప్లాన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం ఎంపిక చేసిన సాంకేతిక నిపుణుల బృందం కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. పోటోగ్రఫీ నుంచి సంగీతం వరకు ప్రముఖ టెక్నీషియన్ పనిచేస్తున్నారు. ఈ వంద రోజుల్లో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసి, సినిమాపై అంచనాలను మరో లెవెల్ కి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ వ్యూహాలు రచిస్తోంది.
కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన యష్, ఈసారి 'టాక్సిక్' తో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి. మార్చి 19న థియేటర్లలో ఈ రాకింగ్ స్టార్ విశ్వరూపం చూడటానికి అభిమానులు సిద్ధంగా ఉండొచ్చు. కౌంట్ డౌన్ మొదలైంది కాబట్టి, ఇక వరుస అప్డేట్లతో సోషల్ మీడియా దద్దరిల్లడం ఖాయం.