యష్ కు పోటీ తప్పేలా లేదే!
సినీ ఇండస్ట్రీలో రిలీజ్ డేట్ల సమస్య రోజురోజుకీ పెద్దదై పోతుంది. ఇండియన్ సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నేపథ్యంలో దర్శకనిర్మాతలు ప్రతీ సినిమాను చాలా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.;
సినీ ఇండస్ట్రీలో రిలీజ్ డేట్ల సమస్య రోజురోజుకీ పెద్దదై పోతుంది. ఇండియన్ సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నేపథ్యంలో దర్శకనిర్మాతలు ప్రతీ సినిమాను చాలా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీంతో ఖర్చు ఎక్కువైపోతుంది. ఖర్చు ఎక్కువవడంతో సోలో రిలీజ్ దక్కితే తప్పించి సినిమాలకు మంచి ఓపెనింగ్స్ దక్కడం లేదు.
ఈ నేపథ్యంలోనే పెద్ద సినిమాలన్నీ ఎప్పుడూ సోలో రిలీజుల కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. వేరే సినిమాలతో క్లాష్ పెట్టుకుని తమ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ ను తగ్గించుకోవాలని ఏ నిర్మాతా అనుకోరు. అందుకే వీలైనంత వరకు అందరూ పోటీకి చాలా దూరంగానే ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే వచ్చే ఏడాది మార్చిలో రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ కు సిద్ధమవుతున్నాయి.
వారం లోపే రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన దురంధర్
అవే యష్ టాక్సిక్, రణ్‌వీర్ సింగ్ దురంధర్2. రీసెంట్ గా రిలీజైన దురంధర్ ఎలాంటి అంచనాల్లేకుండానే వచ్చి వారంలోపే రూ.150 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ సినిమా సీక్వెల్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. పైగా సినిమా క్లైమాక్స్ లో దురంధర్2 నెక్ట్స్ ఇయర్ మార్చి 19న రిలీజ్ కానుందని అఫీషియల్ గా వేశారు. రిలీజ్ కు మరో 100 రోజులే ఉండటంతో నిర్మాతలు కూడా దానికి తగ్గట్టు అన్నివిధాలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.
టాక్సిక్ తో దురంధర్2 క్లాష్
అయితే అదే రోజున యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీని కొన్ని నెలల కిందటే అనౌన్స్ చేశారు. అయితే మార్చి 19 నుంచి టాక్సిక్ వాయిదా పడుతుందని వార్తలైతే వస్తున్నాయి కానీ మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కే వస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. పైగా తాజాగా 100 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడంతో టాక్సిక్ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ వస్తోంది.
అయితే దురంధర్2 ఆ రోజే కావాలని తమ సినిమాను రిలీజ్ చేయడానికి రీజన్ లేకపోలేదు. వాస్తవానికి ఆ రోజున సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ రిలీజవాలి కానీ అది వాయిదా పడటంతో ఆ డేట్ ను వాడుకోవాలని రణ్‌వీర్ సింగ్ భావిస్తున్నారట. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ పోటీకి వెళ్తారా లేక ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారా అన్నది చూడాలి.