రామాయణం బడ్జెట్ హాలీవుడ్ లెక్కలే కీలకం!

నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'రామాయణం' చిత్రం గురించి గత కొంత కాలంగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Update: 2026-08-16 11:30 GMT

నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'రామాయణం' చిత్రం గురించి గత కొంత కాలంగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న చిత్రానికి మొద‌టి భాగానికే 4000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయించారనే ప్ర‌చారం హాట్ టాపిక్ గా మారింది. ఇంత భారీ మొత్తం ఎలా తిరిగి వస్తుందనే సందేహాలు తలెత్తిన నేపథ్యంలో? ఈ చిత్రంలో రావణుడిగా నటిస్తోన్న‌... అలాగే సహా నిర్మాతగా ఉన్న యశ్ తాజాగా దీనిపై స్పష్టతనిచ్చారు. ఓ ప్రముఖ టీవీ షోలో యశ్ స్పందించారు. 4000 కోట్ల రూపాయల బడ్జెట్ గురించి జరుగుతున్న ప్రచారంలో ఉన్న అపోహలను తొలగించారు.

ఈ మొత్తం కేవలం ఒక భాగానికి మాత్రమే కాదని, రెండు భాగాల నిర్మాణం, ప్రమోషన్లు , విడుదల ఖర్చులను కలిపి ఈ అంచనా వేశారని వివరించారు. `హాలీవుడ్ సినిమాలు ఎలాగైతే గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని బడ్జెట్‌ను ఖర్చు చేస్తాయో? మేం కూడా అదే హాలీవుడ్ మ్యాథ్స్ ను పాటిస్తున్నాం. ప్రమోషన్లకు భారీగా ఖర్చు చేయడం అనేది అంతర్జాతీయ స్థాయిలో సాధారణ ప్రక్రియ అని పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే తమ ప్రధాన లక్ష్యమని యశ్ నొక్కి చెప్పారు. `సినిమా అనేది గొప్ప సాఫ్ట్ పవర్. ప్రపంచ దేశాలు తమ సంస్కృతిని, శక్తిని చిత్రాల ద్వారా చూపిస్తున్నప్పుడు మనం కూడా అడుగు ముందుకు వేయాలి.

మనం చేయకపోతే మరొకరు ఈ అవకాశాన్ని వాడుకుంటారు. కానీ భారతీయ సినిమా జెండా ప్రపంచ వేదికపై ఎగరాలి అనేది నా దృఢమైన నమ్మకం` అని య‌శ్‌ వ్యాఖ్యానించారు. రామాయణం రెండు భాగాలతో పాటు యశ్ నటిస్తున్న `టాక్సిక్` చిత్రం కూడా భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నాల్లో భాగమేనని తెలిపారు. ఈ భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ఇండియన్ సినిమాకు ఉండే గ్లోబల్ రెవెన్యూ పొటెన్షియల్‌ను గుర్తు చేశారు. ఆర్థిక లాభాలే కాకుండా భారతీయ ఇతిహాసాలను ప్రపంచానికి సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో అందించడం ఈ ప్రాజెక్టుల ఉద్దేశమని వెల్లడించారు.

రామాయణం మొదటి భాగం నవంబర్ 6న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. `టాక్సిక్` మాత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ భారీ ప్రాజెక్టులపై ప్రేక్షకులు ...విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ వివరణతో ఈ చిత్రం పట్ల ఉన్న బడ్జెట్ సందేహాలు కొంతవరకు తొలగిపోయాయి. ఏది ఏమైనా? భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయానికి రామాయణం ప్రాజెక్ట్ పునాది వేస్తుందనేది నిపుణుల బ‌లంగా న‌మ్ముతున్నారు.

Tags:    

Similar News