శృంగార సన్నివేశాలపై వివాదం: యశ్ ఆశ్చర్యం!
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్`.
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్`. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కొన్ని శృంగార సన్నివేశాలపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత, ట్రోల్స్ వ్యక్తమయ్యాయి. ఈ అనూహ్యమైన విమర్శలపై యశ్ ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం.
ఆధునిక సమాజంలో ముఖ్యంగా జెన్-జీ తరానికి చెందిన యువత సినిమాల్లో బోల్డ్‌నెస్ .. రొమాన్స్‌ను చాలా సాధారణంగా స్వీకరిస్తారని యశ్ భావించారుట.
సినిమా పేరులోనే `ఫర్ గ్రోన్-అప్స్` (పెద్దల కోసం) అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కొన్ని వర్గాల నుంచి వస్తోన్న నెగెటివిటీని చూసి యశ్ విస్మయానికి గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ఈ సందర్భంగా యశ్ వెబ్ సిరీస్ ల్లో..డాక్యుమెంటరీల్లో హద్దు మీరి ఉండే శృంగార సన్నివేశాలను గుర్తు చేసినట్లు సమాచారం. అక్కడ లేని వివాదాలు...విమర్శలు టాక్సిక్ విషయంలోనే ఎందుకు తలెత్తినట్లు అని ఆరా తీస్తున్నారుట. సినిమా కథ డిమాండ్ మేరకు నేటి ఆధునిక యువత ఆలోచనా విధానానికి తగినట్లుగానే ఈ సన్నివేశాలను రూపొందించినట్లు యూనిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
టైటిల్ ...జానర్ ముందే స్పష్టం చేసిన తర్వాత కూడా ఇలాంటి విమర్శలు రావడం పట్ల యశ్ సహా చిత్ర బృందం కూడా ఆశ్చర్యపోతోంది. నేటితరం ప్రేక్షకులు కంటెంట్‌ను మెచ్యూర్డ్‌గా రిసీవ్ చేసుకుంటారని, ముఖ్యంగా గ్లోబల్ ఆడియన్స్ ఇలాంటి బోల్డ్ .. రియలిస్టిక్ అప్రోచ్‌ను ఇష్టపడతారని టీమ్ గట్టిగా నమ్ముతోంది. అయినప్పటికీ కొందరు సోషల్ మీడియాలో అనవసరమైన రాద్ధాంతం చేయడం పట్ల యశ్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గీతూ మోహన్‌దాస్ ఈ కథను ఎక్కడా రాజీ పడకుండా? ఒక డార్క్ ఫెయిరీ టేల్ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
కథలో ఎమోషన్స్‌ను పండించడానికి, పాత్రల మధ్య రిలేషన్‌షిప్‌ను బలంగా చూపించడానికి కొన్ని సన్నివేశాలు అనివార్యమని మేకర్స్ వాదిస్తున్నారు. వివాదాల కోసం కాకుండా కథాంశం డిమాండ్ చేసిన మేరకే ఆ సీన్లను ప్లాన్ చేశామని యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో చిన్నపాటి వివాదాలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయనడంలో సందేహం లేదు. యశ్ కెరీర్‌లో ఎప్పుడూ విభిన్నమైన ప్రయోగాలకే ప్రాధాన్యత ఇస్తారని `టాక్సిక్` ద్వారా కూడా ఆయన ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.